కళ తప్పింది
నువ్వు నా దగ్గర లేని వేళ:
విరగగాచిన వెన్నెల కళ తప్పింది
చల్లని రేయి వేసవి తాపమైంది
ప్రవహించే నది కన్నీటిని గుర్తుచేసింది
పవళించే పాన్పు పరిహసించింది
కమ్మని కల కనుచూపు మేరే నిలిచిపోయింది
తల వాల్చే దిండు “నీ స్థానం ఇక్కడ కాదు నీ ప్రేయసి యెద పైన” అని కసిరింది
నా సఖియా నీ కోపం నా మీద నీ ప్రేమ కంటే గొప్పదా
నీ భర్తని నీ బిడ్డగా భావించి చేరదీయవా నీ కౌగిళ్లకి…
-దీపక్