కల ఫలించింది
నలభై అయిదు సంవత్సరాలక్రితం బందర్లో పడమట కోటేశ్వరరావు అనే వ్యక్తిచిన్న టైలరింగ్ షాపు పెట్టుకునితన జీవనయానం చేసేవాడు.
ఆయన షాపు పేరు వెల్డన్ టైలర్స్. వృత్తి రీత్యా టైలర్అయినా నటన అంటే అతనికిప్రాణం. ఎక్కడ అవకాశం దొరికినా నాటకాలు ఆడేవారు.
వినాయక మండపాల్లోనేకాక పెద్ద సంస్ధలలో కూడానాటకాలు వేసేవారు. మంచినటుడు అనే గుర్తింపు వచ్చింది.
ఒకవైపు టైలరింగ్చేస్తూనే నటనలో మంచి పేరు తెచ్చుకున్నారు. టైలర్ గామంచి పేరుంది. అప్పటికే ఆయనకు పిల్లలు కూడాకలిగారు.
అలా పనిచేస్తూఉన్న ఆయనకు సినిమాఅవకాశాలు వచ్చాయి.చాలా టీవీ సీరియల్స్ లో,సినిమాల్లో కూడా మంచిఅవకాశాలు దొరికాయి.
ఆయన పట్టువదలని విక్రమార్కుడు. యాభై సంవత్సరాల కృషి ఆయననుకారెక్టర్ ఆర్టిస్టుగా నిలబెట్టింది.
ఆయన ఓపిక ఆయనను నటుడిగా నిలబెట్టింది.ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.
-వెంకట భానుప్రసాద్ చలసాని