కల

కల

నేను ఒక బిల్డింగ్ ఎక్కుతున్నను. నా చుట్టూ కొందరు ఉన్నారు.వాళ్ళు కూడా నాతో పాటే వస్తున్నారు. మేమంతా మాట్లాడుకుంటున్నాం.ఈ బంగళా చాలా బాగుంది మనం ఇక్కడే ఉండి పోదాం. అందంగా చుట్టూ పచ్చని చెట్ల తో ఎంతో బాగుంది ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా హాయిగా అనిపించింది.
నాతో ఉన్నవారు కూడా అదే అంటున్నారు అబ్బా రమం ఎంత బాగుంది రా ఈ ప్లేస్ మనం అందరం ఇక్కడే ఉందం ఇక్కడ నుందుబసలు వెళ్ళకూడదు. ఇంత ప్రశంతమనియా చోటు మనకు మరెక్కడా దొరకదు. అందరం కలిసి మనకు నచ్చినవి వండుకుని తింటే హ్యాపీగా ఏ బాధలు లేకుండా ఉండొచ్చు రా ఏమంటావు అన్నారు.

నేనేమన్నా ఇంత మంచి ప్లస్ ను కాదని అనగలనా నేను కూడా వారితో నాకు ఇది చాలా నచ్చింది రా అందరం సంతోషంగా ఒకే కుటుంబంగా ఉండొచ్చు .అందరం ఉమ్మడి కుటుంబాలు లేని ఈ కాలంలో మీరంతా మతో ఉంటాను అంటే ఎందుకు కడంటాను అంటూ పక్కకి తిరిగి నువ్వేం అంటావు సీత అంటూ అడిగాను. అవునండి మమణం అంతా బాగుంటాం.

ఇక్కడే ఉంటాం ఇక నాకు నచ్చింది ఏమంటారు అత్తయ్య అనగానే రామం తల్లి దానికేం భాగ్యం కానీ అందరూ ఆకలితో ఉన్నట్టు ఉన్నారు నేను వెళ్లి వంట చేస్తాను అంటూ పక్క గదిలోకి వెళ్ళి చేతులతో అగ్గి ముట్టించి పక్కనే పోతున్నా పిల్లి నీ పట్టుకుని దాని మెడ విరిచేసి పొయ్యి మీద గిన్నె పెట్టీ అందులో పిల్లిని వేసి నూనె ఉప్పు కారాలు వేసి కలియెట్టాలి ది. కాసేపటికి అందరికీ ఘుమఘుమలు లాడే పిల్లి మాంసం , కంచలలో వడ్డించింది అమ్మ . లొట్టలు వేసుకుంటూ పిల్లి మాంసం  అందరం తిన్నాం .

హమ్మయ్య చాలా రోజుల నుండి తిండి లేక మాడిన మాకు పిల్లి మాంసం ఎంతో రుచిగా అనిపించింది. తెల్లారి న తర్వాత అమ్మ వంట చేయాలి ఏమైనా దొరుకుతాయో అని చూసింది కానీ అక్కడ ఏమీ దొరకలేదు. ఇక అప్పుడు అమ్మ సీత మిగిలిన నా స్నేహితులు అంతా నా వైపు చూడసాగారు .నాకు విషయం అర్దం అయ్యింది. అంటే వాళ్ళు ఇప్పుడు నన్ను వండుకుని తినబోతున్నారు అని తెలియగానే వామ్మో వద్దు వద్దు నన్ను చంపొద్దు నన్ను తినకండి అంటూ పరుగులు తీశాను.

ఒరేయి ఎదవ సచ్చినో డ పన్నెండు అవుతుంది ఇంకెంప్పుడు నిద్ర లేస్తావురా  తెల్లార్లు ఆ దెయ్యం సినిమాలు చూడడం ఇలా అరుపులతో మమల్ని భయపెట్టడం ఛీ ఛీ పాడు సంత లే వెధవ అంటూ రామం తల్లి మొహం పై నీళ్ళు చల్లడం తో మెలకువ వచ్చిన రామం కలను గుర్తు చేసుకుంటూ అమ్మో కాళరాత్రి లాంటి కల ఇంకెప్పుడు హార్రర్ సినిమాలు చూడకూడదు అనుకున్నాడు మనసులో….

 

-అర్చన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *