కల

కల

హమ్మయ్య ఆఫీస్ టైమ్ అయిపోయింది ఇంటికెళ్ళి అన్నం వండుకుని తిని కమ్మగా నిద్రపోవాలి. అబ్బా! ఈ మగవెధవలు ఒకటి రోడ్డు నిండా వాళ్ళే ఉంటారు. ఏది చూడాలన్న, ఎవర్ని చూడాలన్నా భయంగా ఉంటుంది అప్పుడే పక్కింటి పంకజం గారు బజారుకు కూరగాయలు తిసుకోవడానికి వెళ్ళి ఇటుగా వచ్చారు.

ఏమిటి సీత ఇంతసేపు ఆఫీసులో ఉన్నావా?! నమ్మబుద్ధి కావట్లేదు. ఈ కాలం ఆడపిల్లలు మరీ చెడిపోతున్నారు అని గొణుక్కుంటూ… ఇదిగో సావిత్రి అక్కా ఈ అమ్మాయే మా ఇంటి పక్కన ఉండేది చాలా మంచిది. అన్నట్టూ నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా! ఇంట్లో ఏమైనా సంబంధాలు చూస్తున్నారా!? ఆ ఊరికే అడిగా మా చుట్టాలబ్బాయి ఉన్నాడు అందుకని అడిగా.

“ఆ చూస్తున్నారు పంకజం గారు…. సరే మీ ఇల్లు వచ్చింది నేను వెళ్తాను. అదేంటి ఇంట్లోకి రాకుండా వెళ్తావా, సరేలే నేనే చక్కెర కోసం నీ గదికి వస్తాను. అంటూ లోపలికి వెళ్ళింది, నేను ఎందుకో వాళ్ళ అపార్ట్మెంట్ పైకి చూసా కుక్క మోరుగుతూవుంది నాకు భయం వేసింది దాని పిల్ల కింద పడింది అందుకే అది అరుస్తూవుంది. అయ్యో నేన్ ఎమ్ చేయను అనుకుంటూ ఇంటికి వచ్చేసా.

ఈ ఆదివారం ఒకటి బట్టలు ఉతుక్కోవాలి, షాపింగ్ కు వెళ్ళాలి, గార్డెన్ క్లీన్ చేసుకోవాలి, నా కొలిగ్ ఏమో కాఫీ తాగటానికి రమ్మన్నాడు. అని అనుకుంటుండగానే ఫోన్ రింగ్ అయింది. ఏమ్మా నువ్వు పోనే చెయ్యవు, ఎప్పుడు చూసినా ఆఫీస్ పని అంటావు. నీ జతలో పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు నువ్వు మాత్రం పెళ్లి అనగానే చిర్రుబుర్రు అంటావు. 

అన్నట్టూ… రేపు ఆదివారం కదా నిన్ను చూసుకోవడానికి వస్తారు నువ్వు ఊరికి రా తల్లి. ఇదిగో మీ నాన్న మాట్లాడుతాడు. దీని మాటలు పట్టించుకోవద్దు, అక్కడ ప్రశాంతంగా ఉండు, నీకు వీలైనప్పుడే మిగతావి చూద్దాం.

సరే మీ నాన్నమ్మ మాట్లాడుతాది సూడు. నాకేమో వయసయ్యి పోయింది, నీ పెళ్లి చూసి పోదామంటే నువ్వేమో ఉద్యోగం సద్యోగం అంటావు. నేను పొయ్యేలోపు నాలుగు అక్షింతలు వేసిపోతాను ఒప్పుకో తల్లి. ఇదిగో నీ తమ్ముడికి బట్టలు, బొమ్మలు, పుస్తకాలు కావాలంట అన్నీ తీసుకురా అలాగే నీ చెల్లికి కూడా! వినపడుతుందా ఏమి మాట్లాడకుండా ఉన్నావు….!?

“ఆ సరే నాన్నమ్మ వస్తాను, ఉంటా….” అసలు ఆడపిల్లలంటే పెళ్లి, పిల్లలేనా! వీటన్నింటికీ దూరంగా భూమి అంచులకి పోయి, నులివెచ్చని కిరణాల తాకిడిలో పాటలు వింటూ సేదతీరాలని ఉంది. పక్కనుంచి ఎదో అరుపు, ఏమిటా అని చూస్తే అమ్మ. ఏమే బర్రెలకు గడ్డి వేయమంటే పొద్దెక్కేదాక పడుకున్నావు అంటూ. “ఓహో ఇదంతా కలా! నిజమైతే ఎంత బాగుండు.

– హనుమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *