కబుర్ల కరచాలనం
అప్పుడే తొలివెలుగులు విచ్చుకుంటున్నాయి
కెంపురంగు ఆకసం ఒళ్ళు విరుచుకుంటోంది
ఇంపైన గాలి చుట్టేస్తుంటే
చుక్కలన్నీగూళ్ళకు చేరుకున్నాయి
చేరువైన దృశ్యాలు,చేరికగా మనుషులు మసలుతుంటే మారాము చేస్తావెందుకయా మనిషీ,మౌన భాష్యాలల్లటం మాని
కబుర్ల కరచాలనాలు చేయిక అంటూ
చల్లని ఆకాశం గోముగా చెబుతోంది
-సి.యస్.రాంబాబు