కారు చీకటి
కాకులు దూరని కారడవిలో..
చీమలు దూరని చిట్టడవిలో..
పాపం ప్రసాద్ పయనిస్తున్నాడు..
కారు చీకటి కమ్మేసింది..
పులుల అరుపులు సింహాల గర్జనలు వినిపిస్తున్నాయి..
భయంకరరమయిన బాధేదో..
ప్రసాదు గుండెలో గుబులు రేపుతుంది..
అయినా నడుస్తున్నాడు..
పరిగెడుతున్న జంతువులను..తప్పించుకుంటూ..
ఒళ్లు గగుర్పొడుస్తుంది..
రోమాలు నిక్కబొడుచు కుంటున్నాయి..
అయినా తప్పదు భయాన్ని..జయించాలి..
ప్రసాదు ఫారెస్ట్ ఆఫీసరు..
అడవి దొంగల గుండెల్లో సింహస్వప్నంలా ఉండాలని..
వెహికిల్ లేకుండా ఒక్కడే..
పోరాటానికి వెళుతున్నాడు..
అదీ సంగతి…
-ఉమాదేవి ఎర్రం..