కాలం వెనక్కి తిరిగితే
నా బాల్యం లోకి ..
వెళ్లాలనుంది..
అమ్మా నాన్నతో..
ఉండాలని ఉంది..
అమ్మ తినిపించే..
గోరు ముద్దలు..
నాన్న కురిపించే..
ప్రేమ వర్షంలో..
తడిసి పోవాలనుంది..
అమ్మ ఒడిలో సేద..
తీరుతూ..
బాల్యం బంగారు బాటలో..
నడవాలనుంది..
ఇద్దరక్కల ముద్దుల చెల్లిగ..
ఇద్దరు అన్నల బంగారు చెల్లిగ..
గారాల పట్టిగా..
అమ్మా నాన్నతో కలిసి కట్టుగా..
ఆట పాటలతో అలరించాలని..
తేనెలొలికే తీయటి..
బాల్యం నా బాల్యం..
అంత కమ్మటి కాలం..
నా కోసం వెనక్కి వస్తే..
అంతకన్నా నాకేం కావాలి!!
-ఉమాదేవి ఎర్రం