కాలతీతo
జీవితంలో బాల్యం ఒక మధుర జ్ఞాపకం. ఆ వయసులో ఏం చేస్తున్నామో తెలియదు. ఏం చేసినా అందరికీ ముద్దుగా బాగుంటుంది అందరూ దగ్గరికి తీసుకుని ముద్దులాడతారు. ఆ తర్వాత మెళ్లిగా బాల్యం కరుగుతూ, జరుగుతూ పాఠశాలలోకి మారుతుంది. అక్కడా సంతోషమే. తోటిపిల్లలతో పాటు ఆడుకోవడం. కొత్త పరిచయాలు. కొత్త తరగతులు. ఒక్కో తరగతులు మారుతూ ఒక్కో విషయాలను ఒక్కో రకమైన జీవితాన్ని చూస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం.
అక్కడ కొన్ని రోజుల వరకు మనమేం చేసినా ఎవరూ ఏమి అనరు ఎందుకంటే పసి వాళ్ళు తెలియదు అనే ఆలోచనతో, ఒక్కో తరగతి పెరుగుతూ ఉంటే అప్పుడు అంటుంటారు ఇంకా చిన్నపిల్లాడివా? ఆ మాత్రం తెలియదా అంటూ మొదలు పెడతారు. అప్పుడు కూడా ఏమి పట్టించుకోము.
ఆలోచన లేదని వేరే పెద్దలు సర్ది చెప్తారు. తెలియనివి తల్లి తండ్రి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. వాటిని ఆకళింపు చేసుకొని ముందుకు వెళ్తాం. ఆ తర్వాత ఇంకా కొంచం పెద్ద హోదా వయసు పెరిగి సంతోషంగా కళాశాలలో అడుగు పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ పెద్ద అయ్యాము అనుకుంటూ ఏదైనా చేయగలం అని పెద్దలను ఒప్పించి లేదా ఎదిరించి అయినా కావల్సింది నా దక్కించుకునే నేర్పు ఉంటుంది..
తర్వాతి జీవితం ఉద్యోగ వేట అక్కడ సమాజం ఎలా ఉందో, సమాజం లోని మనుషుల మనస్తత్వం అనేది తెలుస్తుంది. ఇన్నాళ్లు చూసిన ప్రపంచం వేరు. ఇప్పటి ప్రపంచం వేరని తెలియడానికి మనం కూడా అందులో భాగం అవడానికి, జీర్ణం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందులో ఇమడలేని వారు చనిపోతే, తట్టుకుని ఉద్యోగం దక్కించుకున్న వారికి జీతం తో పాటూ జీవితం విలువ తెలుస్తుంది.
తర్వాత అంశం పెళ్లి ఇది ఆడవారికి ఉద్యోగం లాంటివి లేకున్నా జరుగుతుంది. కానీ మగాడికి ఖచ్చితంగా ఉద్యోగం ఉండాలి, అమ్మాయిని పోషించగలిగే శక్తి ఉండాలి. పెళ్లి తర్వాత జీవితం మరోలా ఉంటుంది. బాధ్యతలు, పిల్లలు తల్లిదండ్రులు భార్య చుట్టాలు బంధువులు అంటూ కొత్త వారి పరిచయాలు, కొత్త బంధుత్వాలు అన్ని కలుస్తాయి. అందులో అంటే సంసార సాగరాన్ని ఈదుతూ, బాధ్యతలను మంచిగా నిర్వహిస్తూ సాగుతూ ఉంటారు.
చివరికి అన్ని బాధ్యతలు పూర్తి అయ్యాక, వృద్ధ్యాప్యం అక్కడ పని చేసే శక్తి సన్నగిల్లతుంది. పిల్లల పై ఆధారపడి బ్రతకల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు పంచుకోవడం లేదా వృద్ధుల ఆశ్రమాల్లో చేర్చడం జరుగుతుంది. అప్పుడు అప్పుడు అనిపిస్తుంది నేను చేయాల్సినవి, నా కలలు, నా ఇష్టాలు, కోరికలు అన్నీ చంపుకుని ఇన్నాళ్లు ఇలాంటి వారికి నా అస్తినంతా పంచి, ఇప్పుడు ఇలా ఎవరూ లేని ఒంటరి జీవితం గడుపుతున్నా అనుకుంటూ బాధపడుతూ చివరికి వారి కోరికలు, ఇష్టాలు, కలలు, ఆశలు అన్నీ చంపుకుని అసంతృప్తితో తుది శ్వాస వదిలేయడం అందరి జీవితాల్లో జరిగేదే….
అందుకే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. చేయకపోతే చివరి అంకంలో అసంతృప్తిగా మరణించాల్సి ఉంటుంది. కాలం చాలా విలువైంది, సరియైన సమయంలో సరైన పని చేయకుండా ఉంటే ఇలాగే ఉంటుంది.
– భవ్య చారు