జ్వాల
నా కళ్ళలో జ్వలించే నిప్పును చూడాలంటే భయం నీకు
నా నాలుక ప్రశ్నించే ప్రశ్నలoటే భయం నీకు
నా చేతుల్లో గీతలు చూస్తే వణుకు నీకు
నీ రాతను మార్చేస్తుంది అని
నా హృదయము అంటే భయం నీకు
పగిలితే రణరంగమే అని తెలుసు నీకు
నా కడుపు అంటే అనుమానం నీకు
ఉన్నవన్నీ కక్కేసి,నీ నిజరూపాన్ని
బయట పెడుతుంది అని
నా కాళ్ళు అంటే వణుకు నీకు
సహనం కోల్పోయిన నాడు
ఆయుధమై అణిచి వేస్తుందని
అందుకే నిమిషం నిమిషం వ్యంగ్యంగా
మాట్లాడుతూ మనసు మీద దెబ్బ
కొడతావు, ఎందుకంటే మనసు నిన్ను ఏమి
చేయలేదని తెలుసు నీకు ..
-భవ్యచారు