జ్వాల

జ్వాల

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ కంటికి కనబడని వైరస్ కొన్ని వేల ప్రాణాలను కనుమరుగయ్యే లాగా చేసింది. ముఖానికి ముసుగు, చేతికి కడుగు, బంధాలకు తెంపు లాంటి నీతి సూత్రాలను వెలుగులోకి తెచ్చింది.

అసలు కంటికి కనబడని ఈ వైరస్ కి మానవ లోకం కుంచె తో ఎంతో అందమైన రంగులు పూసింది. ధర్మ సంరక్షణార్థం వచ్చింది ఈ వైరస్ అని కొందరు మానవ విలువల్ని పెంచింది అని మరికొందరు బంధాలను దగ్గర చేర్చింది అని ఇలా ఈ క్రిమిని, క్రీమ్ గా మార్చేశారు.

ఈ సాంఘిక దూరం అనే అద్భుతమైన సంప్రదాయం ఈ క్రీం వల్ల వచ్చినది ఏమీ కాదు. అనాదిగా తాతల కాలం నుండి ఇది శిక్షించ బడని నేరం గా మన్ననలు సంఘంలో అందుకుంటోంది.

వృద్ధులైన తల్లిదండ్రులను వారసులు దూరం నెట్టేస్తున్నారు. పక్కింటి పొరిగింటి ఓడు మనకి కొన్ని వేల మైళ్ల దూరం. పార్టీల పేరుతో పక్షాలు ప్రతిపక్షాలు దూరం. విదేశీ చదువుల పేరిట మన పిల్లలు దూరం.

ఇక్కడ నేను ఒక చిన్న కథ చెప్తాను. దాదాపుగా 30 ఏళ్ల క్రితం ఈ క్రిమి లేదండి ఆ రోజుల్లో. కానీ ఈ సాంఘిక దూరం మాత్రం వేళ్లూనుకొని ఉంది. ఒక పసి హృదయాన్ని దూరం పెట్టిన పైశాచిక మైన ఒక జీవరాయి గురించి ఇక్కడ చెప్తాను.

అతడు చాలా దగ్గరి బంధువు. నేను ఆయనకి ఇచ్చిన బిరుదులు జీవరాయి. ఆ రోజుల్లో ఇంగ్లీషు వాడుక కి ఇంకా అంత గుర్తింపు రాలేదు అలాంటి రోజుల్లో ఆయన ఇంగ్లీషు నీ కషాయ ప్రాయంగా మాట్లాడేవాడు.

వేసవి సెలవుల్లో అందరూ ఒకచోట చేరాము. ఇందులో కొందరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాస్త వీళ్ళకి ఇంగ్లీషులో ఏబిసిడిలు వచ్చు. ఇహా మా జీవరాయి వారికి అయస్కాంతం.

కషాయ ప్రాయంగా వాళ్లతో ఇంగ్లీషులో దంచుతున్నాడు. నాకు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఆ పసి హృదయం ఆ లేత మనసు ఆ జీవరాయిని తెలుగులో చెప్పమని ప్రాధేయపడింది.

తోటివారు అందరి ముందు ఆయన ఆ పసి హృదయాన్ని కించపరిచేశాడు. పోరా ఇక్కడి నుండి నీకు ఇంగ్లీష్ అర్థమై చస్తుందా అని కసిరాడు.

చిన్నబోయిన ఆ హృదయం ఆయనతో సాంఘిక దూరాన్ని ఈ రోజు వరకు పాటిస్తూ వస్తోంది. ఆయనపై పెంచుకున్న జ్వాలని, ఈ రోజు, ఆ హృదయం తన ఇంట కాంతులు వెదజల్లే దీపం గా మార్చుకుంది.

నాడు గాయపడిన పడిన ఆ చిన్నారి నేడు వేనోళ్ళ పొగడ బడుతున్న ప్రముఖ ఆంగ్ల కవి. ఆ పసి హృదయం చేసిన కృషి ఇప్పుడు ఆయనని ప్రముఖుల సమీపాన నిలబెట్టింది.

మనోభావం:- సముద్రపు నీటిలో నేను ఒక చిన్న బిందువును. అలలతో నాట్యంచేస్తూ కేరింతలు కొడతాను. తరంగాలతో చేరి రాగాలను ఆలపిస్తారు. ఈ బిందువు ను చూడ నీకు సక్యం అవునా? నేను నీకు సముద్ర సమానుడను.

– వాసు

0 Replies to “జ్వాల”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *