జీవితమంటే..?
*జీవితమంటే జీవితంతో రమించడం
జీవితమంటే జీవితంతో శోధించడం
జీవితమంటే జీవితంతో రాసానుభూతి చెందడం
జీవితమంటే జీవితాన్ని కళాత్మకంగా చూడటం
జీవితమంటే జీవితంతో పోరాడటం
జీవితమంటే జీవితంతో అన్వేషణ సాగించడం
జీవితమంటే జీవితంతో తనువు చాలించడం..!!
-సైదాచారి మండోజు