జీవితం విలువ తెలుసుకో
“మౌళి… ఆర్డర్ వచ్చింది , తొందరగా తీసుకొని వెళ్ళు” అని చెప్పాడు నగేష్.
“అలాగే సార్…” అని వెళ్ళాడు మౌళి.
మౌళి వాళ్ళది చిన్న గ్రామం వ్యవసాయం చేసే కుటుంబం సిటీకి చదువుకోవడానికి వచ్చాడు.
చదువుకుంటూ ఇలా ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ మధ్యనే చెల్లెలికి పెళ్లి చేశారు. ఒక సంవత్సరం క్రితం ఒక ఆక్సిడెంట్ అన్నయ్య చనిపోయాడు.
వాళ్ళ అన్నయ్య బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ ఊరికి వస్తుండగా ఆక్సిడెంట్ జరిగింది.
ఉన్న కొంచం పొలంలో వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్నారు తన తల్లిదండ్రులు.మౌళి కస్టమ్స్ కి ఫుడ్ డెలివరీ చేసిన ప్రతివారితో నవ్వుతూ పలకరిస్తూ టైం కి డెలివరీ చేసేవాడు.
అందరికి మౌళి అంటే ఇష్టం ఏర్పడింది. ఇలా తన జీవితం ఆనందో బ్రహ్మ గా సాగిపోతున్న సమయంలో ఒక అమ్మాయి తన జీవితంలో వచ్చింది.
ఆదర్శ్ కి మౌళి చదువులో పోటీగా ఉన్నాడని కోపంగా రగిలిపోతున్నాడు. అందరితో కలిసి ఉంటాడు మౌళి.
కాలేజీలో కొత్త జాయిన్ అయిన జలజ తన అందంతో అందరి మగవాళ్ళలను ఆకట్టుకుంది.
ఆదర్శ్ కి తొలి చూపుల్లోనే జలజ నచ్చింది. తనతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు.
అందరి మగవాళ్ళు జలజను చూశారు కానీ మౌళి మాత్రం ఒకసారి కూడా తన వైపు చూడలేదు.
ఆదర్శ్ కి మౌళి గురించి అడిగితే ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడు.
మౌళి ని ఎలాగైనా తన చుట్టూ తిప్పుకోవాలని అని తన మనసులో అనుకుంది జలజ.
ఒకరోజు మౌళి తన ఫ్రెండ్ అయినా ప్రవీణ్ లు జలజ కూర్చుని ఉన్న పక్కన ఉండి వెళుతుంటే జలజ కాళ్ళు పెట్టడం వల్ల ప్రవీణ్ పడిపోయాడు.
అది గమనించిన మౌళి వెంటనే తన ఫ్రెండ్ ని పైకి లేపి జలజ వైపు చూసి ,“ఎందుకు… ప్రవీణ్ కాళ్ళకు అడ్డంగా నీ కాళ్ళు పెట్టావ్? అని కోపంగా అడిగాడు మౌళి.
“నేనే కాళ్ళు అడ్డం పెట్టాను అని ఇక్కడ ఎవరైనా చూసారేమో అడుగు” అని అహంకారంగా సమాధానం చెప్పింది జలజ.
“రేయ్… అనవరసంగా గొడవ వద్దు రా. నా మాట విను” అని చెప్పాడు ప్రవీణ్.అలాగే… అని మౌళి చెప్పి ,
జలజ తన ఫ్రెండ్స్ తో బయటకు వెళుతుండగా మౌళి కాళ్ళు అడ్డం పెట్టాడు. జలజ పడిబోతుండగా , అప్పుడే ఆదర్శ్ వచ్చి పట్టుకున్నాడు.
కోపంగా జలజ , మౌళి దగ్గర వెళ్లి కొట్టాలని అనుకుంది , కానీ కొంచం సేపు ఆలోచించి తగ్గి కోపంతో బయటకు వెళ్ళిపోయింది.
రెండు రోజులు తర్వాత ఒక అమ్మాయిని చులకన చేసి తిట్టుతుంది జలజ.ఆ అమ్మాయిని చెల్లెలుగా భావించి , మౌళి ,జలజ చెంప చెళ్లుమనిపించాడు.
“ఆ అమ్మాయి పేదరికంలో పుట్టడం వల్ల నువ్వు ఇంత చులకనగా చూస్తున్నావ్.
అసలు జీవితం విలువ నీకు తెలుసా? నువ్వు డబ్బులో పుట్టి పెరిగిన అంతమాత్రాన అహంకారం చూపిస్తున్నావ్. ఒక వారం రోజుల తనతో ఉండి చూడు.
ఎవరు ఎలాంటి వాళ్లో నీకే తెలుస్తుంది. నీ వెనక ఉన్న డబ్బుని చూసి నీతో స్నేహం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. జాగ్రత్త ఉండు” అని చెప్పాడు మౌళి.
జలజ పశ్చాత్తాపం పడింది. జలజని ప్రేమిస్తున్నాను ఎంతోమంది మగవాళ్ళ వాళ్ల జీవితం నాశనం చేసుకున్నారు.
జీవితం విలువ తెలుసుకొని బ్రతుకుతే మన జీవితం ఆనందో బ్రహ్మంగా ఉంటుంది.
-మాధవి కాళ్ల