జీవితం ఒక నాటకరంగం
“జీవితం ఒక నాటకరంగం”. అన్నాడు కరీమ్.”అలా ఎందుకు అంటున్నారు”?అన్నాడు మదన్.”
మనకు ఇష్టం లేకపోయినామన ఇంటి పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాము.లౌక్యంగా ప్రవర్తిస్తాము.అలాగే భర్త తన భార్య చేసినవంట బాగోకపోయినా బాగుంది అని చెపుతాడు.
ఎలాగో సర్దుకుపోతాడు.అది కపట నాటకం లాగాచూసేవాళ్ళకు అనిపించినాఅది లౌక్యంగా ప్రవర్తించటం అని అతనికి తెలుసు.” అన్నాడు కరీమ్.
“అవును నిజమే. నాకు మాబాస్ వేసిన జోక్స్ నచ్చవు.అయినా ఆ జోక్స్ వింటూనవ్వురాకపోయినా నవ్వుతూఉంటాను. ఆయన చేసే పనులు సక్సస్ అవ్వవని
తెలిసినా సూపర్ ఐడియాసర్ అని ఆయనను పొగుడుతూ ఉంటాను.మా బాస్ దేనికీ లొంగడు
కానీ పొగడ్తలకు పడిపోతాడు.
ఆయన బలహీనతను నేనునా ఎదుగుదలకు వాడుకుంటూ ఉన్నాను.ప్రమోషన్ మీద ప్రమోషన్కొట్టేస్తున్నాను. నీ దృష్టిలోఅది నేను చేసే కపట నాటకం
అని అనుకున్నా అది నాదృష్టిలో అది లౌక్యంగా ప్రవర్తించటం అనుకుంటున్నా”
అన్నాడు మదన్.
అవును అది నిజమే. మనంసమాజంలో జీవిస్తూ ఉంటాము. మన చుట్టూ ఉండేవాళ్ళలో కొందరు మనకి నచ్చరు. వారు మనకు నచ్చినా, నచ్చకపోయినా
మనం వారితో సఖ్యతగాఉన్నట్లు నటించాలి. అలానటించకపోతే మన పనులుపూర్తి అవ్వవు.
అలా నటించేవారిని మనం తప్పు పట్టలేం.వారివి కపట నాటకాలు అనిమనం అనలేం.”అన్నాడు కరీం.అయినా నువ్వు సూపర్భయ్యా. చాలా గొప్పగా
ఆలోచిస్తావు.”అన్నాడు మదన్.
“పొగిడింది చాలు కానీనీకు డబ్బులు ఎంత కావాలో చెప్పు”అన్నాడు కరీం.నేను నిన్ను పొగిడిందిడబ్బుల కోసమే అనికరెక్టుగా కనిపెట్టావు.ఎంతయినా నువ్వు
సూపర్ భయ్యా”అన్నాడుమదన్.
“సరే, సరే పొగిడింది చాలు.ఇంటికొచ్చి డబ్బు తీసుకో”అన్నాడు కరీమ్.ఏదిఏమైనా మనని పొగిడేవాళ్ళందరూ ఊరికే మననిపొగడరు సుమా. వారికి ఏదో కావాలి కాబట్టి మనల్ని పొగుడుతారు.
కొందరుమన టాలెంట్ గుర్తించిపొగిడేవాళ్ళు కూడా ఉంటారు.కపట నాటకాలు ఆడి ఇతరులను మోసం చేయడం తప్పు కానీ దాని వల్ల పదిమందికి ఉపయోగంజరిగితే అలా చేయటంమంచిదేమో.
-వెంకట భానుప్రసాద్ చలసాని