జీవిత పోరాటం
కాటికి కాలు చాపే
వయసులో భార్య వినియోగంతో
ఒంటరివై జీవిత
పోరాటం చేస్తూ..
నీ బాధ్యతలు
విస్మరించకుండా
నీ గురించి
ఆలోచించకుండా బాధ్యతే ఆయుధంగా మలుచుకొని
మోయలేని గుండె
భారముతో జీవితపు
ఒంటరి నావ ఒడ్డుకు తీసుకురావడానికి
పడరాని కష్టాలు పడుతూ
నీ కన్న వాళ్లే
నీకు శత్రువులైన
ఎవరిని లెక్క చేయకుండాఎవరికి లోబడకుండా
ఎంత చాతకాకపోయినా
నీకు నువ్వు ధైర్యం
తెచ్చుకొని శక్తిని కూడ పెట్టుకుని ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా
నీరెక్కడించుకుంటూ
బరువైన భారాన్ని మోస్తూ..
చివరకు ఒంటరి నావ
ఒడ్డుకు చేర్చి శబాష్
అనిపించుకొని శాశ్వతంగా లోకం నుండి వెళ్లిపోయావు..!!
-బేతి మాధవి లత