జీవన విధానం
నాలుగు పాదాల సనాతనధర్మం
సుదీర్ఘకాల పరిభ్రమణంలో
ఒక్కొక్క పాదాన్ని పరిత్యజిస్తూ
ఏకపాద సత్యంపై
కలికాలపు అధర్మం
చెoతన ధ్వజస్తంభమై
దర్జాగా నిలుచున్నప్పుడు
అవశేషంగా మిగిలిన
దైవత్వం రెక్కలు విప్పిన రాక్షసత్వపు ఉన్మత్తతకు
అవినీతి అంధకారపుదారిలో
అతి శీఘ్రగతిలో
అధపాతాళానికి అభిముఖంగా
అవనతం కావలసిందేనా?
సనాతన ధర్మం అంటే
శాసనం కాదు
అది ఒక జీవన విధానం అని
చాటిచెప్పే కృతయుగ
పునస్సాక్షాత్కారం
కలియుగపు
పడగనిడలో ఇక ఎప్పటికీ కల్లేనా?
పాదాలు నాలుగు: అవి సత్యం దయ తపస్సు ధనం
పాదం అంటే నాలుగో వంతు 25 /
ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని కోల్పోతూ ఇప్పుడు ఉన్న కలియుగంలో సత్యం అనే ఓకే పాదం పైన కలియుగం నడుస్తోంది.
అంటే 75% చెడు అన్నమాట.
-మామిడాలు శైలజ