జీవచ్ఛం
“దేవిక… రేపు హరి వస్తున్నాడు” అని చెప్పింది అబిక.”అవునా… హరి అన్నయ వస్తున్నాడా? సరే అమ్మ బై” అని చెప్పి స్కూల్ కి వెళ్లిపోయింది దేవిక.
“హ్మ్… జాగ్రత్తగా వెళ్ళు” అని చెప్పింది అబిక.
ఆ రోజు ఆదివారం కాబట్టి అబిక వాళ్ళ దగ్గర బంధువుల ఫంక్షన్ కి వెళ్ళారు అబిక , పరమేష్.తన ఫ్రెండ్ అయిన బిందు దేవిక ఇంటికి వచ్చింది.
వాళ్లు హోం వర్క్ చేసి , ఆడుకుంటుంటే గేట్ కొట్టిన సౌండ్ వినిపించింది.దేవిక వెళ్లి గేట్ తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కొంచెం ఆశ్చర్యంతో
అన్నయ్య… అంటూ హరి గుండెల మీద వాలిపోయింది.
హరి చేయి పట్టుకుని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళింది. తన ఫ్రెండ్ బిందుని పరిచయం చేసింది దేవిక.బిందువైపు ఒకరకంగా చూసి చూపులతోనే ఒళ్లంతా తడిమేస్తున్నాడు. హరి బిందువుని తన దగ్గరికి పిలిచిన కూడా వెళ్లకుండా ,”సరే నేను ఇంకా ఇంటికి వెళ్తాను” అని చెప్పి కంగారుగా ఇంటికి వెళ్ళిపోయింది బిందు.
ఒకే ఊరు కాబట్టి పరమేష్ , హరి వాళ్ళని సొంత అన్నలా భావించడం వల్ల హరిని తోడబుట్టిన అన్నయ్యలా దేవిక అనుకుంది. అప్పుడప్పుడు సెలవులకు హరి వీళ్ళ ఇంటికి వస్తే మాత్రం దేవికకు పండగ.
అబిక , పరమేష్ లు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి , దేవికని స్కూల్ కి పంపించేసి అబిక తన జాబ్ కి వెళ్ళిపోతుంది.సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత బిందు వాళ్ళ అమ్మ వచ్చి ఇద్దరిని తీసుకొని వస్తుంది.ఒకసారి దసరా సెలవు ఇవ్వడం వల్ల హరి ఇంటికి వచ్చాడు.రెండు రోజుల తర్వాత చాక్లెట్ కోసం షాప్ కి వెళ్ళింది దేవిక.
బిందు దేవిక ఇంట్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి ఉంది. కానీ ఎవరు కనిపించలేదు. సరే లే బిందు అనుకోని టీవీ ముందు కూర్చొని చూస్తుంది.
వాష్ రూమ్ లో ఉన్న హరి బయట వచ్చి బిందుని చూసి ముందు చుట్టూ చూసి మెల్లగా తలుపు వేసి బిందు మాత్రం టీవీలో మునిగిపోయింది.
వెనక నుండి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బిందు దగ్గరకు వెళ్ళి గట్టిగా బిందు నడుము పట్టుకున్నాడు. మళ్ళీ ఎక్కడెక్కడో చేతులు పెట్టుతుంటే బిందుకి భయం వేసి ,
” అన్నయ్య… ఏం చేసున్నారు. నన్ను వదిలేండి”గట్టిగా కేకలు , అరవడం మొదలు పెట్టింది.కానీ హరి మాత్రం బిందు నోరు తన చేతితో మూసి ,’ఈ విషయం ఎవరికైనా చెప్పితే మీ అమ్మ , నాన్నలను చంపేస్తాను” అని బెదిరించాడు.ఆ భయంతో ఎవరికి చెప్పాను అని చెప్పి బిందు ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయింది.
ఇలా హరి వచ్చి ప్రతిసారి బిందు మీద లైగింక దాడి చేసి తన కోరిక తీర్చుకొనేవాడు.బిందు ఎంతో నరకయాతన అనుభవించింది.ఒక రోజు హరి గురించి చెడుగా బిందు చెప్పితే దేవిక అసలు నమ్మలేదు.అప్పుడు నుండి హరి గురించి ఎవరికి చెప్పలేదు బిందు.
హరి చాలా మంచివాడని , బాగా చదువుతాడు , అందరితో మర్యాదగా ప్రవర్తించాడు అని బయట మాత్రం మంచి పేరు సంపాదించాడు.
హరి తమ్ముడు నీరజ్ ఒకమ్మాయి ప్రేమించాడన్ని ఆ విషయం ఊరు మొత్తం పుకార్లు షికారు చేసింది. అప్పుడు చుట్టూ పక్కల ఉన్న వాళ్ళందరూ హరి గొప్పవాడు. అందరిని స్నేహంగా ఉంటాడు అని అనుకున్నారు. కానీ ఊరిలో ఉన్న వాళ్ళందరూ మాత్రం నీరజ్ ని ఒక తప్పు చేసిన వ్యక్తిగా చూడడం మొదలు పెట్టారు.
అది వాడికే అవమానంగా అనిపించి వేరే ఊరిలో జాబ్ చూసుకొని వెళ్ళిపోయాడు నీరజ్.బిందుకి మాత్రం హరి పేరు వింటే చాలు పట్టరాని కోపం వస్తుంది. ఒక రోజు టీవీ చూస్తూ ఉండగా ఒక ఛానల్ లో అసలు లైగింక దాడి అంటే ఏమిటి ?అనే అంశం మీద చిన్నపిల్లల్లో అవగాహన కలిగించడం మా బాధ్యత అని టీవీ యాంకర్ చెప్పి ,ఒకమ్మాయి ఎంతో ఉషారుగా ఉంటూ అందరితో కలిసి మాట్లాతుంది. వాళ్ళ ఇంటికి ఎదురుగా ఇంటికి ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన కూడా అందరి స్నేహంగా ఉంటాడు. పిల్లలంటే చాలా ఇష్టం.
ప్రతి రోజు ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చేవారు. అయితే ప్రతి రోజు ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళు.ఒక రోజు ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈరోజు ఒక కొత్త ఆట ఆడుకుందాం అని చెప్పారు పెద్దాయన.
ఆ అమ్మాయి మీద లైగింక దాడి చేయడం ఎప్పుడు ఉషారుగా అమ్మాయి డల్ గా కనిపించడం వాళ్ళ క్లాస్ టీచర్ గమనించి ఆ అమ్మాయి నుండి అసలునిజం తెలుసుకొని ఆ పెద్దాయనని పోలీసులకు అప్పగించారు టీచర్.లైగింక వేధింపు గురించి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు.బిందు ఈ సంఘటన చూసిన తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చింది.
హరిని ఎలాగైనా ఎదిరించాలని ఎన్నో సార్లు తనకు తానే ధైర్యం చెప్పుకునేది.హరి చూడగానే మాత్రం మెల్లగా కంగారుగా మొదలు అయ్యి కాళ్ళు , చేతులు వణుకుతాయి.ఇలా ఎన్నో ప్రయత్యాలు చేసి బిందు విఫలం అయ్యింది.ఇంకా హరి లాంటి స్వార్థపరుడు మధ్య ఉండలేక వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయింది.
బిందు ఊరు వెళ్ళిన దేవికకు మొదట్లో ఫోన్ చేసిన హరి గురించే చెపుతుంటే వినలేక మరి ఫోన్ చేయడం మానేసింది.ఇలాంటి స్వార్థపరులు మంచి అనే ముసుగు తొడిగి వాళ్ల గురించి ఎవరికైనా చెప్పితే నా మీద వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి , మరి సాక్షాలు ఉన్నాయా అని అడుగుతారు.
ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం కలుగుతుంది.
ఇలాంటి సంఘటనలు అసలు బయటకు రావు. వస్తే మాత్రం చచ్చిపోయే ధైర్యం లేక జీవచ్చంగా బ్రతుకుతారు. హరి లాంటి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు.
అవునా ఇలాంటివి సమాజంలో జరుగుతుంది వున్నా ఆడ పిల్ల నోరు విప్పలేక సగం చస్తూ బతుకుతున్న ఉంటే అమ్మాయి ఏదో తప్పు చేసినట్లు చూస్తుంది సమాజం…
ధైర్యం చేసి చెప్పిన మగవాడి ముసుగు కు బానీషాలు ఐపోయి అమ్మాయి మాటనే పాటించుకోరు…
అద్భుతం అండి అమ్మాయిల పై ల్యాంగిక దాడుల కోసం వాళ్ళు పడే బాధకోసం దాజాగా తిరిగే హరి లాంటి వాళ్ళ కోం చాలా బాగా రాసారు… 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏