జీవితపు పోరాటం
ఆశలు నిరాశలు
వ్యాధులు బాధలు
వేదనలు రోదనలు
తలుచుకుంటే పోరాటం
భార్యతో భర్త పోరాటం
భర్తతో భార్య పోరాటం
అన్న చెల్లి తో పోరాటం
చెల్లి అన్నతో పోరాటం
అత్త కోడలితో పోరాటం
కోడలి అత్తతో పోరాటం
ఇవి మానితే జీవితం కోలాటం
గాంధీ గారు చెప్పినారు
స్వాతంత్రం రావాలని
అర్ధరాత్రి ఆడపిల్ల తిరగాలని
శ్రీమతి ఇందిరా గాంధీ చెప్పినారు
కూడు గూడు గుడ్డ పోరాటం
చేస్తే మన మానవ సమాజం
నిరంతరం నిలువెత్తు శిఖరం
అందుకోగలదు ధన్య భరితం
నీతి కోసం పోరాటం
జాతి కోసం పోరాటం
జరిపినారు త్యాగధనులు అయినారు
నేడు మన భారత్ కి
కూడు గూడు గుడ్డ ప్రాథమిక అవసరాలు నెరవేర్చగలగాలి
అప్పుడే రామరాజ్యం
అప్పుడే గాంధీ తత్వం
అప్పుడే నెహ్రూ గారు ప్రజాస్వామ్యం
చూడగలం
చూడగలం
మాటికి
ముమ్మాటికి
చూడగలం
– యడ్ల శ్రీనివాసరావు