జీవితమంటే
1) జీవహింస మాని జీవించు మనిషిగా
పరమధర్మమగును ధరణియందు
సాటి మనిషి కింత సాయము జేయుము
జీవితమున ధన్యజీవి యగుము
2) కలిమి వున్నవరకు కాదనకుండగా దీనజనులబాధ దీర్చవలయు
పరులసేవజేయ పరమాత్మ మెచ్చును
జీవితమున ధన్యజీవి యగుము
3) ఎంతసంపదున్న ఏమి తీసుకపోవు
మంచివారికైన మరణముండు
మంచిపనులు చేయ మార్గదర్శవి గమ్ము
మంచి శాశ్వతమ్ము మనిషి కెపుడు
4) అమ్మ నాన్న కెపుడు అండగా నుండుము
జన్మ ధన్యమగును జగతి యందు
మంచి చెడులు దెలిసి మసలిన జీవికి
మరలజన్మరాదు మర్మమిదియె
– కోట