జీవిత తిరోగమనం – పార్ట్ 3
అలా జాబ్ సెర్చ్ చేయగా ఒక ఉద్యోగం వస్తుంది ఉదయ్ కూ నెలకు 30000వేలు జీతం.. ఇక ఆ తల్లీ కొడుకు ఆనందానికి అవధులు లేవు రెండు సంవత్సరాలు గడిచే సరికి మొత్తం అప్పు తీర్చేసి భారం దించుకుంటాడు ఉదయ్.. ఇక అమ్మను కూడా సిటీకి తీసుకోని వెళ్లి బాగా చూసుకోవాలి అనీ గట్టిగా ఫిక్స్ అవుతాడు ఉదయ్…
ఉదయ్ టీమ్ లీడర్ అవ్వటం. శాలరీ పెరగటం. అన్నీ జరిగిపోయి డబ్బుకు లోటు లేకుండా ఉంటాడు…
కొడుకు స్థిరపడ్డాడు అనీ ఆ తల్లీ కూడా చాలా సంతోష పడుతుంది. కానీ… కానీ… ప్రేమ వస్తుంది ఈ సారి ప్రళయమై ముంచెత్తడానికి…
ఒక మరాఠి అమ్మాయి బాష రాదు కేవలం చూపులు కాస్త ఇంగ్లీష్ భాష తో ఇరువురి మనసులు ఒక్కటి అవుతాయి… ఉదయ్ సాత్వి ఇంటికి వెళ్లి తన ప్రేమ విషయం మొత్తం చెప్పగా సాత్వి తండ్రి నిరాకరిస్తాడు.. ఎంత ప్రయత్నం చేసిన అన్నీ విఫలం అయ్యాయి.. ఉదయ్ తన ప్రేమ లో ఓడిపోయాను అనీ చాలా బాధ పడుతాడు..
తన తల్లీ ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఉదయ్ కి ప్రేమ మాత్రమే జీవితం కాదు ఇంకా చాలా ఉంది అనీ ధైర్యం చెప్పి తన కొడుకుని డిప్రెషన్ నుండి బయటకు తెచ్చుకొని పెళ్లి చెయాలి అనీ సంబంధం చూసి ఇక పెళ్లి సరిపోతుంది నీచ్చయం తాంబూలం తీసుకోని పెళ్లి ముహుర్తాలు పెట్టె సమయానికి ఉదయ్ ఫోన్ కూ మెసేజ్…
ఉదయ్ నువ్వు లేకుండా నేనూ ఉండలేను అనీ సాత్వి నుండి… నీకూ పెళ్లి సెట్ అయ్యింది అట ఇపుడే చెపుతున్న నువ్వు కనుక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేనూ ఇక ప్రాణాలతో ఉండను అనీ చాలా కాన్ఫిడెంట్ గా ఉదయ్ తో చెపుతుంది సాత్వి..
ఇప్పుడు ఉదయ్ ఎం చేస్తాడు?
– కళ