జీవిత తిరోగమనం – పార్ట్ 2

జీవిత తిరోగమనం – పార్ట్ 2

ఉదయ్ తన తండ్రి మాటల జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరు అవుతాడు.. తన తండ్రి 11 వ దినము కార్యక్రమం జరిపిన తరువాత ఉదయ్ చుట్టూ చేరిన బాబాయ్, మావయ్య కుటుంబాలు మీరేం భయపడకండి ఉదయ్ ని మేము చదివిస్తాం అని తన తల్లికి భరోసా ఇచ్చారు. కాకపోతే చిన్న కండిషన్ అని పెద్ద సమస్యే ముందు పెట్టారు ఉదయ్ కు తన బంధువులు…

చదువుకు అయ్యే ఖర్చు మొత్తం లెక్క రాస్తాం వడ్డీ లేకుండా నువ్వు మొత్తం చెల్లించాలి నీకు జాబ్ వచ్చాక అనీ… అసలే జల్సాలకు అలవాటుపడిన ఉదయ్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతాడు… చేసేదేం లేక ఇక అమ్మను చూసుకోవలసింది నేనే, ఆడంబరాలకు పోకూడదు అని గట్టిగా అనుకోని సిటీకి బయలుదేరుతాడు..

తన స్నేహితులను రూమ్ లో ఉండొద్దు, మా ఇంటికి వచ్చేయండి, ఆ కట్టే డబ్బులు ఏదో మాకు కట్టి మా పేదరికంలో అండగా ఉండండి. మా అమ్మ మీ బట్టలు ఉతికి పెడుతుంది, ఇంటి భోజనం చేస్తుంది మీకూ ఏ ఇబ్బంది ఉండదు ప్లీజ్ నాకు సాయం చేయండిరా అని చాలా దీనంగా వేడుకుంటాడు ఉదయ్ తన ఫ్రెండ్స్ ని..

ఉదయ్ ఏంట్రా ఇది ఎందుకు ఇలా ఏంటి ఇదంతా అని రామ్ అడగగా ఉదయ్ మొత్తం చెప్తాడు. తన బాబాయ్, మావయ్య మధ్య జరిగిన ఒప్పందం మొత్తం… రేయ్ మేము ఫ్రెండ్స్ రా డబ్బు సాయం చేయకపోవచ్చు కానీ మీ ఇల్లు హాస్టల్ చేస్తా అంటున్నావ్… తప్పకుండా వస్తాంరా అని రామ్ చెప్పి మొత్తం 15 మంది ఉదయ్ ఇంటికి వెళ్లి హాస్టల్ లో ఎంత అమౌంట్ అయితే కడుతారో అంతా అమౌంట్ కడుతూ ఉదయ్ ఇంట్లో ఉంటారు…

తరువాత చదువు తప్ప వేరే లోకం అనేదే లేకుండా కసిగా తన బీటెక్ పూర్తి చేసి ఇక నా కష్టాలు గట్టు ఎక్కుతాయి అని అనుకునేలోపే మళ్ళీ ఓ పెద్ద సమస్య ఆహ్వానం పలికింది అదే కోచింగ్ రూపంలో.. లక్ష రూపాయలు కట్టి జాయిన్ అయితే జాబ్ గ్యారెంటీ అనే భరోసా ఇచ్చింది ఆ కోచింగ్ సెంటర్…

డబ్బు కోసం అని మళ్ళీ బంధువులను అడిగాడు కానీ ఇప్పటికే చాలా పెట్టాము ఉదయ్ నీకూ వాటిని ముందు చెల్లించు ఇక పై నీకు డబ్బులు మేము ఇవ్వలేము అంటూ తెగేసి చెప్పటంతో ఇక చేసేదేం లేక బెంగుళూరుకు వెళ్లి అక్కడ తన మావయ్య కొడుకు రూంలో ఉంటూ తనకి వండి ఇంటి పనీ చూసుకుంటూ జాబ్ సెర్చింగ్ చేసుకొనే వాడు…

– కళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *