జీవిత గమ్యం చేరాలంటే (పిల్లల కోసం)
జీవిత గమ్యం చేరాలంటే
అందరి సహకారం కావాలి.
కలసి మెలసి పనిచేయాలి.
డబ్బును పొదుపుగా వాడాలి.
దురలవాట్లకు దూరం అవ్వాలి.
మంచి పనులు చేస్తుండాలి.
మనం చక్కగా చదువుకోవాలి.
కొత్త విషయాలు నేర్చుకోవాలి.
కాలాన్ని సద్వినియోగపరచాలి.
సజ్జనుల మైత్రిని పొందాలి.
పెద్దలమాటలను ఆలకించాలి.
గురువు ఆశీస్సులు పొందాలి.
ధైర్యాన్ని కూడగట్టుకోవాలి.
సదా విజయాన్ని కాంక్షించాలి.
– వెంకట భానుప్రసాద్ చలసాని
మంచి మాటలు చదవండి