జీవి అంటే!
మంచితనమే ఊపిరై శ్వాసించి,
నీ దృష్టితో శాంతాన్ని వెదుకు,
వాక్కులో శుద్ధి వెలువరుచు,
నవ్వు ఆయుధం : సంహరించు పరుషం,
చెయ్యి అందించు అందరికీ,
చెయ్యి చాచకు ముందరికి,
నీ అడుగులు వెనుక వారికి ఆదర్శము, ,
ఆరాటము లేదు విరామముగ సాగు,
నీ బాటలో ముల్లుని తీసిన,
ఫల బీజము నాటిన సమానము,
నిన్ను అనుసరించిన నాకు అది ఆదర్శము,
మరియు రాజమార్గము,
ఇట్లుండిన నీవు సంఘజీవివి
లేకుండిన నీవు సంఘర్షణ జీవివి.
– వాసు