జీవనశకటం

జీవనశకటం

జనన మరణ
సమ్మిశ్రితమైన
అంధకూపము లాంటి
అవనీతలంలో ఆశాపాశాలను
భరిస్తూ వేదనలు, రోదనలను
విస్మరిస్తూ అన్ని దశలను
నిబ్బరంగా ఎదుర్కొంటూ అగమ్యగోచరమైన
రహదారిలో అంతూ
దరి లేని యాత్రను
కొనసాగిస్తున్నాను!
చిరుగడ్డి పువ్వు లాంటి ఆశల చుక్కానిని ఆసరా చేసుకుని రాత్రిoదివాలు ఒంటరిగా
ఒక్కొక్క కుసుమాంబువులను
రాల్చే తీవెలా సకల
బంధనాల సంకెళ్లను
చేదించుకుంటూ
ఆఖరి ఆరామాన్ని
చేరుకునే దిశగా
నిర్నిరోధంగా జీవనశకటాన్ని నడిపిస్తున్నాను.!
ఈ బతుకు పయనంలో
అనాలోచితంగా తప్పటడుగు
వేస్తే దయతో క్షమించి
దరిచేర్చుకో ధరణీశ్వరా!

 

కవితలోని పదాలు వాటి అర్ధాలు

సమ్మిశ్రితం = సమ్మేళనం
అంధ కూపము = పాడునుయ్యి
అవనితలం= భూమి

 

– మామిడాల శైలజ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *