జీవ వైవిధ్యమే జీవనము నిలుపు
ఆటవెలదులు
1) జీవరాసులన్ని జీవించు సహజమై
అరమరికలు లేక అవనియందు
మనిషి స్వార్థబుద్ధి మారణ హోమమై
ప్రాణి మనుగడకిల హాని గలిగె
2) విశ్వమంత చిత్ర వింతజీవుల రాశి
పంచభూతములతొ పరవశించు
మారుతున్న నరుడు మరణమొందించినా
ఉనికి కొరకు తిరిగి ఉద్భవించు
3) నీరు.భూమి.గాలి.నిప్పు.ఆకాశము
స్వచ్ఛమై జగమున సంచరించు
పంచభూతములను పంచి. కాపాడిన
లోకమంత శాంతి లోగిలగును
4) విశ్వమంత బహుల వింతజీవుల మయం
అణువు నుండి జీవ అణువు బుట్టు
ప్రాణులన్ని పెరుగు ప్రకృతి ధర్మము
మార్చబోవు నరుడు మరణమందు
– కోట