జయకేతనం

జయకేతనం

గగనాన వెల్లివిరిసెను
ఇంటింటా స్వేచ్ఛా విహంగమై
త్రివిధ దళాల అండదండలతో
త్రివర్ణ పతాక రెపరెపలను చూడు

ప్రాణమిచ్చిన త్యాగధనులు
ఎందరెందరి వీరమరణం
మరెందరి ఆశయాల త్యాగఫలం
నేటి మన పింగళి జయకేతనం

వినువీధిన రెపరెపలతో
త్యాగమును,కష్టమును, సంపదను తనలో దాచుకుని
మనసంతా భక్తిని‌ నింపి

జయహో భారతమా అంటూ
భరతమాత కంటి వెలుగుగా
గగనాన్నంటేలా ఎగురుతుంది చూడు

సమస్యలెన్నున్నా ఐక్యతారాగాలాపనతో
విభేధాలెన్నున్నా వెన్నుచూపని వీరత్వంతో
భిన్నత్వాన ఏకత్వం చాటుతూ అలరారుతూ
తిరంగా రెపరెపల రాజసం చూడు

డెబ్బది ఐదు వసంతాలు పూర్తితో
అమృతమహోత్సవ సంరంభమున
ప్రతి భారతీయుని మది మదిని నిండి
గర్వాతిశయాలతో ఎగురుతున్నది మన త్రివర్ణ పతాకం

భారత మాతకీ జై అంటూ
త్యాగధనులకి‌నివాళులిడుతూ
స్వాతంత్ర్య భారతవని పండుగలో
భవిష్యత్తరాలకి దేశభక్తి నేర్పుతూ
సగర్వంగా చేయుదమా తిరంగాకు సెల్యూట్ల జేజేలను.

– ఉమామహేశ్వరి యాళ్ళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *