జట్కా జంగయ్య

 జట్కా జంగయ్య

నా పేరు జగ్గులు ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ని,  వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు
నాకు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఇది ఆ రోజుల్లో మేము చాలా పెదవారిగా కుటుంబ పోషణ జరుపుకునే వాళ్ళం ఇక అప్పట్లో మా నాన్నగారు మా గ్రామ పెద్ద ఇంట్లో పాలేరుగా ఉండి మా అందరినీ సాకుతు ఉండేవారు నాకుడా పెళ్లయింది నాకు ఒక బాబు మనుషుల సంఖ్య పెరుగుతుండడంతో

జీవనోపాధి లేక ఏదైనా పని చేయాలి. నాన్నకు తోడుగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పట్లో వాహనాలు ఏవి ఉండేవి కావు ప్రయాణం ఎక్కువగా నడక మీద ఆధారపడే వాళ్ళు చిన్న చిన్న మట్టి రోడ్లు ఉండేవి ప్రయాణం చేయాలంటే చాలా భయపడేవారు. మరి అలాంటి సమయంలో ఒక సదుపాయాన్ని ఎన్నుకుంటే మాకూడ గిట్టుబాటు అవుతుంది.

ఇక అలా వచ్చిన డబ్బుతో మనం హాయిగా బ్రతకచ్చు అని కొంత డబ్బు కూడబెట్టి ఒక గుర్రపు బండి కొనుకున్నాను నేను గుర్రపు బండి కొనిన నాటి నుండి మా దశ తిరిగింది ప్రతి క్షణం నాకు కాళీ లేకుండా కిరాయి తగులుతూ ఉండేదిబాగా సంపాదిస్తున్నాను ఉదయం వెళ్లి రాత్రి పన్నెండు గంటలు వరకు ఇంటికి చేరే వాడిని కాదు. ఎవరికి ఎం అవసరం ఉన్న నన్నే పిలిచేవారు.

అలా ఒక సంవత్సరం గడిచింది ఒక రొజు అవసరం పడి మాకు ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉన్న పట్నం వైపు వెళ్ళాను పట్నంలో పని పూర్తి అయ్యే సరికి రాత్రి ఎనిమిది గంటల సమయం ఆ సమయంలో నేను ఇంటికి వస్తున్నాను నేను వస్తూ ఉన్న మార్గంలోనే రామకృష్ణ థియేటర్ వద్ద చాలా ఎక్కువ మంది జనం ఉన్నట్టు కనిపించారు అలా చూడగా గొడకి ఉన్న సినిమా పోస్టర్ నా కంట పడింది.

అది అన్నగారి సినిమా పాతాళభైరవి ఆ సినిమా అప్పటికే రెండుసార్లు చూసాను. కానీ మళ్ళీ చూడాలని కోరిక ఇక జట్కబండి థియేటర్ దగ్గరకు తీసుకు వెళ్ళాను గుర్రానికి మేత వేసి వాటిని కట్టేసాను గుర్రం హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. సమయం కూడా కావడంతో థియేటర్ లోకి వెళ్ళాను సినిమా మొదలైంది .ఇక ఆ సినిమా అయ్యేటప్పటికి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు జట్కా పై వస్తున్నాను. పట్నం లో రోడ్లు అంతంత మాత్రం జనం అంత చెల్ల చెదురుగా ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు.

రోడ్ అంత కాళీ పట్నం దాటేసాను దాటేసరికి పక్కన పార్క్ ఉంటుంది పార్క్ పక్కగా వెళ్ళిపోతున్నాను వేగంగా వెళుతున్న గుర్రం కాస్త వేగం తగ్గించింది పైగా సకలిస్తోంది నేను గట్టిగా అదిరించాను కానీ గుర్రంమొరాయింస్తోంది ఏమైందో ఏమో తెలియట్లేదు పైగా చుట్టూ పక్కన అంత చీకటి నేను కిందకి దిగి గుర్రాన్ని శరీరం దువ్వి సరి చేశాను మళ్ళీ గుర్రాన్ని అదిరిస్తే అస్సలు కదలడం లేదు.

ఇక అప్పుడే ఆ పార్క్ లో నుంచి ఒక చిన్న అమ్మాయి ఏడుపు వినిపించింది నేను ఆలోచించాను. ఇంత అర్థరాత్రి వేళ చిన్న అమ్మాయి ఏడవడం ఎంటి అని అనుమానం కలిగింది. అమ్మాయి ఏడుపు ఇంకా గట్టిగా వినిపిస్తోంది. ఎవరై ఉంటారు చిన్న పిల్ల ఏడవడం ఏమిటి పక్కనే ఉన్న పార్క్ లోకి చేరుకున్నాను. పార్క్ అంత చీకటిగా ఉంది ఎక్కడ ఎవరు కనిపించడం లేదు మరి ఏడుస్తోంది ఎవరు అని అంతా వెతికాను. ఎంత వెతికినా నాకు అక్కడ ఎవరు కనిపించలేదు ఇక అప్పుడే నన్ను ఎవరో తాకినట్టుగా అనిపించింది వెనక్కి తిరిగి చూసాను ఒక అమ్మాయి నా చేయి పట్టుకుని ఏడుస్తోంది.

ఎవరు తల్లి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగితే మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు అని చెప్పింది. ఆ అమ్మాయి మాటలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి.

సరే ఏడవకు మీ ఇల్లు ఎక్కడో చెప్పు అని అడిగాను అందుకు ఆ అమ్మాయి మా ఇల్లు ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పింది పాప వయసు సుమారు పది సంవత్సరాలు ఉంటుంది. మరి ఇల్లు ఎక్కడుందో తెలియకపోవడం ఎంటి అని పాపని ఎత్తుకుని జట్కా బండి దగ్గరకు తీసుకువచ్చాను. ఇక్కడ ఎవరూ లేరు మరి ఈ పాపని ఎక్కడ వదిలిపెట్టాలి అని చూస్తున్నాను.

అయిన నాకు ఏమి తోచడం లేదు సరే నాతో పాటు తీసుకువెళతాను రేపు ఎం చేయాలో ఆలోచిద్దాం అని నా బండిలో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాను. అంతవరకు మొరాయించిన గుర్రం వేగంగా వెళ్తోంది పాప ఏమి మాట్లాడకుండా కూర్చుంది. నేను పాపని మాట్లాడించాలి అని పాప నీ పేరేంటి అని అడిగాను. తన పేరు చాలా పాతకాలం నాటి వ్యక్తి పేరు చెప్పింది. పాప నీకు నీ పూర్వీకులు పేరు పెట్టరా అని అడిగాను. కాదు నాకు ఇలాంటి పేరుతో మా పూర్వీకులు ఎవరు లేరు అని చెప్పింది అలా నాతో మాట్లాడుతూనే…

నాకు భయం వేస్తోంది నేను వెళ్ళిపోతాను అని చెప్పింది అయ్యో భయపడకు తల్లి నేను ఉండగా నీకు ఎందుకు భయం ఈ రాత్రికి మా ఇంట్లో ఉందాం రేపు ఉదయాన్నే నిన్ను మీ వాళ్ళకి అప్పగిస్తాను అని చెప్పను కాని ఆ అమ్మాయి వినిపించుకోలేదు ఉన్నట్టు ఉండి ఏడవడం మొదలు పెట్టింది. నేను ఎడవద్దు అని చెప్పిన వినిపించుకోలేదు. నన్ను కిందకి దింపు నేను వెళ్ళిపోతాను అని చెప్తోంది. ఈ సమయంలో నిర్మాన్యుష్యగ ఉన్న ప్రదేశంలో విడిచిపెడితే ఏమి అయిపోతుందో అనే భయంతో పాపని ఎడవద్దు అని చెప్తున్నాను ,బ్రతిమాలుతు ఉన్నాను.

అలా ఏడుస్తూ ఉన్న అమ్మాయి హాటాత్తుగా ఏడుపు ఆపేసింది ఇక అప్పటికే జట్కా పట్నానికి చాలా దూరం చేరుకుంది. పాప ఏమి మాట్లాడకుండా కూర్చుంది మళ్ళీ మాట్లాడిస్తే ఏడుస్తుందని నేను మాట్లాడకుండా జట్కా బండిని తోలుకుంటున్నాను. నేను దాటబోయేది ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఆ ఊరి గ్రామదేవత మనికేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడి ఒక పొలిమేరలో ఉంటుంది

అదే పొలిమేరలో మేము అడుగు పెట్టబోతున్నాం ఇక అప్పుడే ఆ పాప నాతో ఇలా అంది బండి ఇక్కడే ఆపు నేను వెళ్ళాలి అంటోంది కానీ అప్పటికే నాకు అర్థం అయ్యింది ఆ పాప మనిషి కాదు అని పాప రూపంలో ఉన్నది ఒక దెయ్యం అని ఆ దెయ్యం ఆట కట్టించాల్సిన సమయం వచ్చింది ఐతే మనం ఒక్క విషయం ఇక్కడ గమనించాలి.ఎడ్ల బండి కానీ గుర్రపు బండి కానీ ఒక అమ్మవారి వాహనంతో సమానం అని మన పూర్వీకులు అంటుంటారు ఐతే ఆ వాహనం నడిచే సమయంలో ఎలాంటి క్షుద్ర శక్తులు ఎక్కలేవట.

అలాగే బండి కదిలే సమయంలో కిందకి కూడా దూకలేవట జట్కా ముందుకు పోనిస్తున్నాను ఇక పాప రూపంలో ఉన్న దెయ్యం నిజరూపంలోకి మారింది ఒక భయంకరమైన రూపం ఆ రూపం చూస్తేనే నాకు వాళ్లంతా చమటలు పడుతున్నాయి బండిలో ఉన్న ఆ ఆకారం తన భారీ కాయాన్ని పెంచుతూ బండి అంత ఆవహించింది గుర్రం కదలెలకపోతోంది వెనక్కి అడుగులు వేస్తోంది.

నేను ఎంత అదిలించిన ముందుకు వెళ్ళట్లేదు గుర్రం రెండు కాళ్ళు లేపి వెనక్కి తిరుగుతోంది నేను చూస్తూ వుండగానే నా కళ్ళ ముందే ఆ దెయ్యం నన్ను ఇష్టం వచినట్టు తిడుతూ నేను నిన్ను ఏదో చేయాలనుకుంటే నన్నే శాశ్వతంగా నాశనం చేసేలా ఉన్నావ్ అని బండి కదలకుండా చేసి ఆ భయంకరమైన ఆకారం కిందకి దూకింది.

వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెట్టింది నిజంగా అమ్మవారి గుడి ఉండడం వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు లేదంటే నన్ను ఆ దెయ్యం ఏదైనా చేసి ఉండేది.

ఇది అప్పట్లో నా జీవితంలో జరిగిన సంఘటన

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *