జత
నీ జతగా నేనుండాలని
ఎన్నో కలలు కన్నాను
మన జత జంటను చూసి
జనాలు నవ్వుకున్నా
పట్టించుకోలేదు
నాకు నువ్వు నీకు నేను అంటూ
జత కలిసి పోయాను
సమాజం ఛీదరించినా
ఒక్కటై నిలిచింది మన జత
నలుగురికి ఆదర్శం కావాలనుకున్నా
మనసులో జత కట్టవని మురిసి పోయారు
నాతో జత కలిపిన నువ్వు
కొన్నాళ్ళు బాగానే ఉన్నాక
నాలో లోపాలు వెతికావు
మన బంధాన్ని మర్చిపోయావా
ఇంకొక మంచి జతను
మరిగి నా జత విడిచి వెళ్ళావు
గువ్వల జంటలా ఉండాలనుకున్నాం
కానీ ఇంకో గువ్వను పరిచయం
చేసుకోని నన్ను నా జతను
వదిలేసి పోయావు.
జతకున్న అర్థాన్ని మర్చావు.
జత లేని నా బతుకుని
అగాధం లోకి నెట్టావు.
ఈ జతలేని బతికేందుకు
ఒక పావురాయి చనిపోతే వేరొక పావురాయి
ఇంకో తోడును వేతుక్కోదు. అది కూడా చనిపోతుంది ఇక
ఆ జంట పావురాల జీవితం వ్యర్థం
నీకు ఇప్పుడు నా మనసు విలువ అర్దం కాకున్నా
ఆ గువ్వ వదిలేసిన నాడు అర్ధమవుతుందని కాంక్షిస్తూ
నా ఈ గువ్వ బతుకును చాలిస్తున్నాను….
– భవ్య చారు