జంట

జంట

అనగనగా ఒక ఊరు ఆ ఊర్లోని ఒక చెట్టు పై ఒక పావురాల జంట ఉండేది. ఆ పావురాల జంట ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉండేవి. ప్రేమకి రూపం ఎవరంటే పావురాలను చెప్తాం. ఎందుకంటే పావురాల లో మగ పావురం చనిపోతే అడ పావురం ప్రాణ త్యాగం చేస్తుంది కాబట్టి ప్రేమకు ప్రతి రూపంగా చూపుతారు.

అయితే ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేది. ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు ఎంత సేపు బయట ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్లేవారు, వచ్చేవారు.

ఒక్క క్షణం కూడా వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఉండేవారు. అయితే ఒకరోజు వాళ్లు అందంగా గూడుకట్టుకున్న ఇంటికి వెళ్లాలని ఆహార అన్వేషణకు వెళ్లి ఆహారాన్ని సంపాదించుకొని తమ గూటికి చేరుతున్న పక్షులకు అక్కడ ఉన్న చెట్లు కనిపించలేదు.

ఏం చేయాలో అర్థం కాలేదు ఆ చెట్టు ఏమైందో అర్థం కాక వాళ్ళు చుట్టూ చూసారు, అక్కడ కొందరు వ్యక్తులు పెద్ద బుల్డోజర్ ఆ చెట్టును నరికి వేస్తూ కనిపించారు. దాంతో ఆ రెండు పావురాలు చాలా బాధపడ్డాయి.

ఎందుకంటే ఎంతో అందంగా కట్టుకున్న గూడు కింద పడి ఉంది. అందులో తాము ప్రేమగా పెంచుకుంటున్న గుడ్లు చితికిపోయి కనిపించడంతో వారి దుఖం వర్ణనతితంగా మారింది. ఇంతలో ఒక వ్యక్తి వాటి పై కాలు వేసి చిదిమేసాడు. అయ్యో అనుకున్నాయి ఆ రెండు పావురాలు.

కట్టుకున్న గూడు పోయింది. పెంచుకున్న పిల్లలు పోయారు. ఇక జీవితం ఎందుకు అనుకున్నాయి, కానీ బ్రతకాలి అనే ఆశ మాత్రం వారిని అక్కడి నుండి వెళ్ళేలా చేసాయి. చనిపోయినా తమ పిల్లలను చూస్తూ వదల లేక వదల లేక వదిలి మరో గూడు కోసం వెతుకుతూ వెళ్ళాయి.

అలా వెళ్ళిన పావురాలకు ఎక్కడా చెట్టు అనేదే కనిపించలేదు. ఎక్కడా గూడు కట్టుకోవడానికి స్థలం దొరకక చివరికి ఒక అపార్ట్ మెంటు సజ్జ పైకి చేరాయి. వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ చలికి వణుకుతూనే అవి చనిపోయిన పిల్లల బాధ నుండి కొంచం బయటకు వచ్చాయి.

తిరిగి ఒకానొక సమయం లో అవి జత గుడాయి. ఫలితంగా ఆడ పావురం అమ్మగా మారింది, కానీ ఈ సారి గూడును గుడ్డు ను ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్న ఆ పావురాలు జాగ్రత్తగా ఉన్నాయి.

పొద్దంతా మగ పావురం ఆహారం కోసం వెళ్తే ఆడ పావురం ఆ గుడ్డును కాపాడుకుంటూ ఉండేది. చివరికి ఒక రోజు ఆ గుడ్డు పగిలి పిల్లగా మారింది. ఆ పావురాలు దానికెంతో సంతోచించాయి. తమకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని భావించాయి.

కానీ ఇంతలోనే ఆ బిల్డింగ్ కు కలర్స్ వేయడం మొదలు పెట్టారు. దాంతో అవి మళ్ళీ వేరొక చోటు చూసుకోవడానికి వెళ్ళాయి.

మొదటి నుండి ఇదంతా చూస్తున్న నాకు చాలా బాధ గానూ, కొంచం సంతోషం గానూ అనిపించింది. ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. దానికి సంభందించిన చిత్రాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *