జన్మ
అమ్మ
బిక్ష ఈ జన్మ
అమ్మ
త్యాగం ఫలం ఈ జీవితం
అమ్మ
ఆశీర్వాదం ఈ ప్రగతి ప్రస్థానం
అమ్మ
రెండక్షరాల పదం
అమ్మ
నిస్వార్థ ప్రేమకు నిర్వచనం
అమ్మ
పసిగుడ్డుగా గర్భంలో బాధించినా
ఎదిగాక అజ్ఞానంతో ఎదిరించినా
చిరునవ్వుతో ఓర్చుకునే సహనశీలి
అమ్మ
కన్న బిడ్డ పుస్తకాలు కోసం
స్ట్రీకి ప్రాణప్రదం అయిన పుస్తెలు అమ్మడానికి సైతం సిద్ధం
అమ్మ ప్రేమని మించింది అవని పై లేదు
అమ్మ అనురాగం నిరుపమానం
అమ్మ త్యాగం అనితర సాధ్యం
రామకోటి కంటే అమ్మ కోటి వ్రాయడం
గుడిలో విగ్రహం కంటే ఇంట్లో అమ్మను పూజించడం శ్రేష్టం
అలా చేయడం
అమ్మ ఇచ్చిన జన్మకు కొంతైనా సార్ధకత ప్రాప్తిస్తుందని
నా ప్రగాఢ విశ్వాసం!
– రాం బంటు