జన నేత

జననేత

సైమన్ కమిషన్ భారతదేశానికి
వచ్చినప్పుడు అప్పటి ప్రజలు “సైమన్, గో బ్యాక్” అనే నినాదంతో ఆ కమిషన్ ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడమే. ప్రజలంతా కమిషన్‌ ఎక్కడికి వెళ్లినా నల్లజెండాలు ప్రదర్శించి స్వాగతం పలికారు. కమిషన్ 3 ఫిబ్రవరి 1928న మద్రాసును సందర్శించినప్పుడు, ప్రకాశం పంతులు ” సైమన్ కమిషన్,గో బ్యాక్” అనే నినాదాన్ని ఇచ్చారు. ప్రకాశం నేతృత్వంలోని ప్రజలను ఆంగ్ల
పోలీసులు హెచ్చరించారు.

ఆ సమయంలో పార్ధ సారధి అనే వ్యక్తిని బ్రిటీషు పోలీసులు కాల్చారు. పార్ధ సారధి నొప్పితో విలవిలలాడాడు.” దాహం దాహం” అని దీనంగా రోదించాడు. అప్పుడు ప్రకాశం అతనికి నీళ్ళు అందించేందుకుముందడుగు వేసాడు.

బ్రిటీష్ పోలీసులు ఒక అడుగు ముందుకు కదిలినా కాల్చేస్తాంఅని ప్రకాశంను హెచ్చరించారు. అప్పుడు ప్రకాశం పంతులు వారి తుపాకుల ముందు నిలబడి తన ఛాతీని చూపెట్టి” దమ్ముంటే కాల్చండిరా” అని సింహనాదం చేసాడు. దీంతో బ్రిటిష్ పోలీసులు వెనక్కి తగ్గారు.

ప్రకాశం ఆ వ్యక్తికి నీరందించాడు. అప్పుడు అక్కడ ఉన్నప్రజలంతా ఆయన ధైర్యాన్నిచూసి”ఆంధ్ర కేసరి జిందాబాద్”
అని నినాదాలు చేసారు.ఆయనకు ఆ బిరుదు ప్రజలే ఇచ్చారు. అలాంటి ప్రజా నాయకులు నేటి తరంలో
కూడా తయారు అవ్వాలి.భారత స్వాంతంత్రచరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

0 Replies to “జన నేత”

  1. వీరులను కన్న తల్లి మన భారతదేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *