జై “జవాన్”! జై “కిసాన్”!
ప్రాపంచిక సుఖాలనన్ని
పక్కన పెట్టి
దేశ రక్షణ బాధ్యత
ప్రాముఖ్యత నిచ్చి
గొప్ప ఆశయాలు
మనమందు నిలిపి
కఠిన పరీక్షలకొగ్గి
చేరు జవానుగ
తన సుఖము కన్న దేశ రక్షణ
మిన్నని,తనప్రాణమును
తృణ ప్రాయముగ నెంచి, అడుగు
ముందుకేయు కదన రంగమున
బాధ్యత భుజము పైనుండ
దేశరక్షణ ధ్యేయమై
తుపాకీ భుజమున పెట్టుకు
కదలు మన వీర జవాను
ఇది ఎరిగి అలనాటి దివంగత
ప్రధాని శ్రీ.లాల్ బహదూర్ శాస్త్రి
జై! జవాన్! జై!కిసాన్!అను
నినాదమునెలిగెత్తి చాటె
జవాను జీవితంలో
మలుపులెన్నో లేవు
విజయమో,వీర స్వర్గమో అన్న
రెండు మలుపులు తప్ప
జై! జవాన్!జై!కిసాన్!
– రమణ బొమ్మకంటి