జాబిలమ్మా …
మబ్బుల నడుమ నలిగిపోతోంది …
కొన్ని కాళరాత్రుల్లో…
తానిచ్చే వెన్నెల…
అడవిలోని అరణ్య
రోదనల నడుమ ముళ్ళ కంపలకు
వేలాడుతుంది….
గబ్బు పట్టిన మబ్బులవి…
తెల్లరంగు పులుముకున్నాయి……
గురువింద గింజలాంటి పెద్దమనుషులు
కప్పుకునే తెల్లని గుడ్డవలే…..
నిర్మాలకాశన నిలిచి…..
ప్రియసఖుడైనా
సాగరునితో ఊసులాడే వేళా….
మృగాళ్ల మధ్య చిక్కిన జింకవలె…
సాలాభంజికలో చిక్కుబడ్డాను….
భ్రష్టు పట్టిన సమాజంలో….
విటుల రాత్రులను
స్వర్గదమలుగా మలిచి…
నేను వైతరణిలో మునిగితేలుతున్నాను….
అమావాస్యపు నిశీధిలో….
– కవనవల్లి