ఇంటింటి మహాలక్ష్ములు
లక్ష్మీ దేవి కటాక్షం లభించాలని ఆశించే వారి ఇల్లు శుచిగా ఉండాలి. అందులో నివసించే వారంతా శుచీ- శుభ్రత పాటించాలి. అలా పాటించేవారు సహజంగాఆరోగ్యంగానే ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యమనిపెద్దలు ఏనాడో సెలవిచ్చారుకదా.
అలా ఇంటిని శుభ్రంగా ఉంచేవారు స్త్రీలే. అలాంటి ఇంటిలో కనుక ఆడపిల్లలు నడయాడుతూ ఉంటే అక్కడ లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఆడపిల్లలే ఇంటి మహాలక్ష్ములు. ఏ ఇంటిలో ఆడపిల్లలంతా నవ్వుతూ, హాయిగా, ఆనందంగా ఉంటారోఆ ఇంటిలో సిరి-సంపదలకుకొదవ ఉండదు.
ఏ ఇంటిలోఆడపిల్లలు ఏడుస్తూ, బాధపడుతూ ఉంటారోఆ ఇంట్లో దరిద్రం తాండవంచేస్తుంది. అందుకే లక్ష్మీ
కటాక్షం కావాలనుకునే వారు తమ ఇంట్లో ఉన్న ఆడవారిని ఏమాత్రం బాధపెట్టకూడదు.
అమ్మ,చెల్లెలి,భార్య ప్రేమనుపొందలేని వాడే నిజమైన దరిద్రుడు. వారి యొక్క ప్రేమను పొందగలిగినవాడే
నిజమైన ధనవంతుడు.కోడలినైనా,కూతురినైనా ఒకటిగా చూసుకునే అత్తగారుదేవతా స్వరూపాలే. అలాగేకోడలిని శత్రువులా చూసుకునేఅత్తగారికి మనశ్శాంతి ఉండదు.
ఈ విషయం గ్రహించిన వారికిలక్ష్మీ కటాక్షం ఉంటుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని