ఇంటి వెలుగు
ఆడపిల్ల ఇంటికి వెలుగు దేవుడు అన్ని చోట్ల ఉండలేక
అమ్మని పుట్టించాడు..అంటారే
అమ్మకి ఇచ్చే విలువ అమ్మాయి కి ఎందుకు ఇవ్వలేరు..
ఒక ఆడపిల్లగా పుట్టుకే ప్రశ్నార్థకమా
ఆడపిల్లగా జెన్మనేత్తి
కూతురిగా,
చెల్లిగా,
అక్కగా,
కోడలిగా,
అమ్మలా, ఇలా ఒక్క జన్మలోనే ఇన్ని అవతారాలు ఎత్తి అన్ని బాధ్యతలను ఊహ తెలియక ముందు నుంచే భుజాలపై వేసుకొని
కూతురి స్థానం లోనే అమ్మ ప్రేమని పంచే ఆడ జెన్మకే ఇన్ని పరీక్షలో…
బ్రతుకు అనే నావలో ఎక్కి గమ్యమే తెలియని ప్రయాణం చేస్తూ అనుమానాలు,అవమానాలు,అలలను ఎదుర్కుంటూ
సునామీల ముంచెత్తే తుఫాన్ లాంటి అభండాలను ఎదుర్కుంటూ ప్రపంచపు ఒరచూపు సుడిగుండంలో మునుగుతు తేలుతూ
బ్రతుకు భారమయ్యి చివరికి అర్థం లేని చీకటిగా మల్చే దుర్మార్గం లో వెళ్ళలేక
శ్వాసను ని కూడా భారంగా బంధించును.
-భరద్వాజ్