ఇంటర్నెట్ మాయ

ఇంటర్నెట్ మాయ

“అమ్మా! ఇంటర్నెట్ రావడం లేదు. వైఫై బాక్స్ మొన్ననే పెట్టారు అని నాన్న చెప్పారు” అని అడిగాడు సౌరేష్.
“అవునురా…. కానీ ఈరోజు వైఫై బాక్స్ ఎదో ప్రాబ్లం వచ్చింది. వాడికి ఫోన్ చేస్తే, వాడు రేపు వచ్చి రిపేర్ చేస్తానన్నాడు” అని చెప్పింది తిలోత్తమ.
“అయ్యో… అమ్మా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. నా ఫ్రెండ్ ఉన్నాడు వాడికి చెప్తాను” అని సౌరేష్ చెప్పి , తను ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు.
“హలో! రేయ్… జాకీ ఎక్కడున్నావ్? మా ఇంట్లో వైఫై బాక్స్ కి ఎదో ప్రాబ్లం వచ్చింది. కాస్త వచ్చి రిపేర్ చేస్తావా?” అని అడిగాడు సౌరేష్.
“హలో… చెప్పు రా నేను షాప్ లో ఉన్నాను రా. ఈవినింగ్ వచ్చి రిపేర్ చేస్తాను” అని చెప్పాడు జాకీ.
“అమ్మా! నా ఫ్రెండ్ ఈవెనింగ్ వస్తాను అన్నాడు” అని చెప్పాడు సౌరేష్.
“సరే టిఫిన్ చెయ్” అని పెట్టింది టిఫిన్ తిలోత్తమ.

సౌరేష్ డిగ్రీ కంప్లీట్ చేసి అమెరికాలో ఎం.స్. సి చేయాలని అప్లికేషన్ పెట్టాడు. మరి కొద్ది రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ గడుపుతున్నాడు. జగదీష్ ఒక మంచి బిజినెస్ మాన్. తల్లితండ్రులకు సౌరేష్ ఏది అడిగినా కాదనకుండా అన్ని ఇచ్చేవారు. సౌరేష్ కి ఒక అక్క ఉంది. ఆమెకి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు లండన్ లో ఉంది.

చాలా రోజుల నుండి సౌరేష్ ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ద్వారా డబ్బులు కూడా వచ్చాయి. అలా ఆ గేమ్ కి బానిసైపోయి గేమ్లో గెలవాలని ఎన్నోసార్లు డబ్బులు కూడా పెట్టాడు. అలా తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి.

రెండు, మూడు సార్లు తిలోత్తమని కూడా అడిగాడు. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పకుండా డబ్బులు తీసుకుంటున్నాడని ఇంకా ఇవ్వడం మానేసింది.

ఒక ఫ్రెండ్ ని అడిగితే “లోన్ యాప్ లో డబ్బులు తీసుకొని తర్వాత నెల నెల కట్టుకో” అని చెప్పాడు. ఆ ఫ్రెండ్ మాటలన్నీ నమ్మి సౌరేష్ లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాడు. ఆన్లైన్ గేమ్ లో గెలవడానికి వచ్చిన మొత్తం డబ్బులు పెట్టేసాడు. కానీ ఒకసారి కూడా గెలవలేదు.

దాంతో చనిపోవాలని రెండు సార్లు ప్రయత్నించాడు. మొదటిసారి ప్రయత్నించినప్పుడు ధైర్యం చాలక చావలేకపోయాడు. రెండోసారి విషం తాగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అంతర్జాల ప్రతిభ సరిగ్గా ఉపయోగించుకోకపోతే మనమే నష్టపోతాం. దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి , కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ఇంటర్నెట్ మాయలో పడి ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులు లేడమంటారో అని భయంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కడుపు కోత కన్నీళ్లను మిగులుస్తున్నారు.

అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని మరి మన హద్దుల్లో మనం ఉంటే మనకే మంచిది.
ఇంటర్నెట్ యూస్ చేయొద్దు అనడం లేదు ఇప్పుడున్న సమాజంలో ఇంటర్నెట్ యూస్ చేయని వాళ్ళు లేరు. ఎంతలో ఉపయోగించాలో అంతలో ఉపయోగించుకొని హద్దులు దాటకుండా ఉంటే మనకే మంచిది. ఇలా సౌరేష్ లా చాలామంది ఇలానే చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.

– మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *