ఇల్లాలు జీవితం
ఇల్లాలు ఇంటికి దీపం అంటారు…
కానీ ఇల్లాలు జీవితంలో ఎలాంటి వెలుగు ఉండదు..
ప్రతీ రోజూ, ప్రతీ క్షణం తను తన కుటుంబం కోసం బతకాలే కానీ తన గురించి ఏ రోజూ తను ఆలోచించదు.
బరువు, బాధ్యత కలిగిన ఆమె జీవితం.. పిల్లలు, భర్త, అత్త, మామలతోనే సాగిస్తూ ఉంటుంది..
తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా పొందదు..
ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఆమె ప్రతి పనిలోనూ తను ఎంతో ఓర్పు, సహనం పాటిస్తూ ఉంటుంది..
తనకు ఉన్ననెర్పరితనంతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇల్లాలు..
ఇంట్లో సంతోషాల పండగ ఇల్లాలి ఆనందంతోనే మొదలు…
కానీ ఇల్లాలు ఎప్పుడూ ఆ వంటింటికి మాత్రమే పరిమితం.
అందరి అవసరాలు తీర్చే యంత్రంలా తనని తాను మార్చుకుంటుంది.
అందరి సంతోషాల కోసం తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది..
చివరికి తనకంటూ ఆ ఇంట్లో ఒక స్థానం ఉంది అని మర్చిపోతుంది…
– మేఘమాల