ఇది కాదా అంతరంగ మథనం
స్వప్నాల సూత్రాలతో
మనసును పెనవేసుకున్న తరుణం
అంతరంగ మథనమంతా
మొదలాయే ఆ క్షణం
ఆశ పడిన జాబిలమ్మను
అందుకోలేనని
మదిలో భావాలను అక్షరనక్షత్రాలుగా
జాబిలి చుట్టు పక్కల పేర్చిన
అమావాస్య జాబిలై
అదృశ్య మైపోయింది
ఇది కాదా అంతరంగ మథనం
నిరాశ నిస్పృహతో
సాగర తీరం వెంట
అసుర సంధ్య ఆశ్రయం లో
ఒంటరి నావలా నడుస్తున్న
పున్నమి వెన్నెలై పలకరించింది
ఉత్సాహం ఉద్వేగం
కెరటాలతో పోటీ పడ్డ
అలలతో చాలక అలసిపోయా
ఆశపడిన జాబిలమ్మ అందరాదని
ఇది కాదా అంతరంగ మథనం
అలసిన తనువును నేలతల్లి అక్కున చేర్చ
అంతరంగ మథనం తో ఆకాశ జాబిలిని చేరుకున్న
ఇది కాదా అంతరంగ మథనం
నా వ్యధను చదివిన వారికి కలుగదా అంతరంగ మథనం
పరివేదన విరచిత కథనం ఇది నా పవిత్ర ఆత్మకు సొంతం
– అభినవ శ్రీ శ్రీ