ఇదేరా స్నేహమంటే
” నన్ను ఈ పోటీలో గెలవలేవురా” అని మహితన మితృడు రాజుతో అన్నాడు. “అదీ చూద్దాం”అన్నాడు రాజు కసిగా. ఒకే క్లాసులో చదివే మహికి, రాజు మధ్య గొడవ ఎందుకు వచ్చిందో తెలియాలంటే మీకు అసలు కధ తెలియాలి. వారిరువురూ చాలా కాలం నుంచి కలిసి చదువుకుంటున్నారు. కలిసిచదువుకుంటున్నారు అనేమాటే కానీ ఇద్దరి మధ్యలో
అంతగా స్నేహం లేదు.
అయితేఇద్దరూ పరుగుపందెంలో చాలాబహుమతులు గెలుచుకున్నారు. అయితే ఈమధ్యన రాజు పెద్దగా ప్రాక్టీస్చెయ్యటం లేదు. ఇంటర్ కాలేజీ పరుగుపందెంలో పాల్గొనమనికాలేజీ యాజమాన్యం ఇద్దరినీ కోరింది. ఇద్దరికీ ప్రాక్టీస్ చేసేసమయం కూడా ఇచ్చింది.
రాజు మాత్రం ప్రాక్టీస్ మానేసికాలక్షేపం చేస్తున్నాడు. మరిఅలాంటి సమయంలో అతనినిరెచ్చగొడితే తప్ప అతనిలో ఉత్సాహం రాదు అని మహిఅనుకున్నాడు.
ప్రైజ్ వస్తే తనకు రావాలి. లేకపోతో రాజుకి రావాలి. బయటకాలేజీ వాళ్ళకు వెళ్ళకూడదు
అని మహి తలచాడు. అనుకున్నట్లే రాజుని బాగారెచ్చగొట్టాడు మహి.
రాజుకసితో ప్రాక్టీస్ చేసి పోటీలోగెలిచి కాలేజీకి బహుమతితెచ్చాడు. మహి తన మనసులోని ఉద్దేశ్యం రాజుకుచెప్పాడు. నీలో గెలవాలనే కసి పెంచాలనే నేను నిన్నురెచ్చగొట్టాననిరాజుతో చెప్పాడు.
తన మంచిగురించి ఆలోచించే మహిఅంటే రాజుకు ఇష్టం కలిగింది.ముందు పోట్లాడుకున్నాఇప్పుడుప్రాణ స్నేహితులుఅయ్యారు.
-వెంకట భాను ప్రసాద్ చలసాని