ఇదెక్కడి న్యాయం
ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నేనుసంవత్సరం కాలం పాటు నాతో జీవితం ప్రయాణం చేసిననా భర్త ఒకే విషయంలో నాతో తరచూ గొడవ పడుతూ ఉండేవారు..
నేను చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తే ,తనమీద ఎక్కడ నేను అధికారం చెలిస్తాననిప్రతిరోజు నన్ను నిందిస్తూనే ఉండేవారు…
పెళ్లికాకముందు ఎంత మంచిగా మాట్లాడినా ,పెళ్లయిన తర్వాత ఒక గొడవతో వాళ్ళ నిజస్వరూపం బయట పడుతుంది…
నా భర్త లో చూడలేని కోపం , ఆవేశం అంతా ఒక్క గొడవతోనే నేను చూసాను…కళ్ళు ఉన్న చూడలేరు ,
చెవులున్న వినలేరు ,
మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పినా వినరు…నా భర్త నిన్ను ఒక విషయంలో అపార్థం చేసుకున్నాను ,
దానికి కారణం ఏంటో నువ్వు చెప్పు నేను వింటాను అని అనరు…కళ్ళు చూసిందే నిజంచెవులు వినదే నిజంచెప్పిన మాట మాత్రం కనబడదు…
నేను తప్పు చేయలేదని వేరే వాళ్ళు చెప్తే గానినా భర్త అర్థం చేసుకోలేరు…అప్పుడు తెలుస్తుంది తాను చేసింది తప్పు అనినేను సంజాయిషీ చెప్పాలనుకుంటే ,నా భర్త మాత్రం చెప్పకుండా ఆపుతారు…
నా భర్త సంజాయిషి చెప్పేటప్పుడు మాత్రం నేను శాంతంగా వినాలి…ఇదెక్కడి న్యాయం…కోపం వస్తే ఇంట్లో వస్తువులు పగలగొట్టేస్తారు…
అదే కోపం అమ్మాయిలకు రాకూడదా?ఇంట్లో వస్తువులు పగలగొట్టకూడదా? ఇదెక్కడి న్యాయం…
-మాధవి కాళ్ల