హృదయం
కవి హృదయం సినారెది..
కవులకది నిలయం సినారె ..
హృదయం..
తెలంగాణ బిడ్డ..
సిరిసిల్ల గడ్డ..
మనసు చెప్పిన మాట..
వెంటనే పుస్తకాన..
చేర్చునట..
పెన్ను పేపరు చేతబట్టి..
వాకింగుల కేగునట..
చెట్టు చేమను చూసి..
పుట్టునట అతని మనసులో..
కవితా గానం..
అచ్చటనే పేపరు పై పెన్ను..
నాట్యమాడునట..
అందమైన పాటలెన్నో..
అతని మనసులోంచి..
జాలువారునట..
కవులందరికీ గురువట…
తెలంగాణకే తల మాణికం..
సినారె..
అతను లేక చిన్నబోయెను..
తెలుగుతనం..
తను భౌతికంగా లేకపోయినా..
తన పాటలతో జీవించే ఉన్నారు..
అందరి నోట..
-ఉమాదేవి ఎర్రం