హృదయ విహారం
ఏదో…. అలా ఎగురుతున్నాను
అల లా…..
కొండల్లో…. గుండెల్లో, గుహల్లో
లోయల్లో.. లోతుల్లో…
పొలాల్లో… పాలల్లో…
ఏదో…. అలా ఎగురుతున్నాను
ఉదయాల్లో… హృదయాల్లో…
నిశి రాత్రి కన్నుల్లో….
సంధ్యా కుంకుమ వన్నెల్లో..
ఏదో…. అలా ఎగురుతున్నాను
చీకటిని చుట్టిన వెలుగుల్లో…
సింగారించిన మంచు వెన్నెల్లో..
ఏదో…. అలా ఎగురుతున్నాను
పిడికిలి లో బిగించిన రక్తంలో…
నుదిటిన శ్రమతో పట్టిన స్వేదంతో…
ఏదో…. అలా ఎగురుతున్నాను
తడి పొడి నిండిన మట్టి వాసన లో.
మానవత్వం నిండిన మనస్సుల్లో…
ఏదో…. అలా ఎగురుతున్నాను
నులి వెచ్చని దేవుని తోడు నీడ నిండిన దేర్యం లో…
అంతా వ్యాపించే కోరికలో
వాయువే వేణువైన గానం లో..
ప్రాణం లో..
అలా… అలలా….
ఆనందో బ్రహ్మ లా
అనంతమైన అంతర్యామి లో
అలా… నీలి వినీల
విశ్వం లో….
అలా … అలలా…. ఎగురుతున్నాను
– అల్లావుద్దీన్