హృదయ తాపం

హృదయ తాపం

ముహూర్తాలు లేవంటూ హడావిడిగా శ్రావణమాసం చివరిలో రోహిణి మోహన్ లకు పెళ్లి చేశారు పెద్దలు హడావిడిగా, అది పెద్దలు కుదిర్చిన పెళ్లి, అందువల్ల రోహిణి ,మోహన్ లకు మాట్లాడుకునే అవకాశం గాని, తమ కోరికలు, ఇష్టాఇష్టాలు చెప్పుకునే అవకాశం కానీ లేకుండా పోయింది.

రోహిణి ఇలా కాపురానికి వచ్చిందో, లేదో అలా ఆషాడమాసం రానే వచ్చింది. అప్పటికి ఇంకా వారికి శోభనం కూడా జరగలేదు, ముహూర్తాలు లేవంటూ ఒకసారి, పనికిరాదని ఒకసారి రెండుసార్లు వాళ్ల శోభనం వాయిదా పడింది. దాంతో రోహిణి మోహన్ ఇద్దరు మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయింది.

ఇద్దరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్న తాను ముందు చేస్తే ఏమనుకుంటుందో అని మోహన్, తాను ముందు చేస్తే ఏమనుకుంటాడో అని రోహిణి ఇద్దరు ఒకరికి ఒకరు ఫోన్లు కానీ, మెసేజ్ కానీ చేసుకోలేకపోయారు.

ఆషాడం అత్తవారింట్లో ఉండకూడదు. కాబట్టి రోహిణి పుట్టింటికి చేరింది. మోహన్ ఏమీ చేయలేక ,తను వెళ్ళిపోతుంటే బేలగా తనని చూస్తూ ఉండిపోయాడు. తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. వాళ్ళిద్దరి కళ్ళు మాత్రం బరువుగా వాలిపోయాయి.
***
పెళ్లెంతవరకే ఎవరైనా అమ్మ కూచి, పెళ్లయ్యాక మాత్రం శోభనం అయ్యేంతవరకు పెళ్ళాం గురించి కలలు కంటూ ఉంటారు .అలాగే మోహన్ కూడా పెళ్ళాం గురించి కలలు కంటున్నాడు.

ఆఫీసులో ఉన్న ఇంట్లో ఉన్న రోహిణి రూపమే కళ్ళ ముందు కదులుతూ ఉంది. బుట్ట బొమ్మల అందంగా చాలా బాగుంటుంది రోహిణి. అందుకే ఏరి కోరి మరీ చేసుకున్నాడు. తల్లిదండ్రులు కూడా ఏ వంక పెట్టకుండా ఎక్కువ కట్నం ఆశించకుండా, పిల్ల బావుంది. అని అన్ని పనులు తెలుసు అని చేసుకున్నారు.

రోహిణికి అందమైన భర్త దొరికాడు అని పెళ్లిలో రోహిణి స్నేహితురాలు చాలా దిప్పిపొడిచారు .నిజానికి మొహన్ చాలా అందగాడు. ఆరడుగులున్న వాడు ,తెల్లగా దట్టమైన మీసాలతో ,ఎత్తుకు తగిన లావుతో, రోజు జిమ్ చేస్తాడు కాబట్టి మంచి జిం బాడి తో చాలా అందంగా ఉండడంతో వాళ్ల స్నేహితులు అబ్బ అందమైన మొగుణ్ణి కొట్టేసావే అంటూ ఆట పట్టించారు.

రోహిణి కూడా మోహన్ అంటే ఇష్టమే. స్నేహితురాలు అతని పొగుడుతూ ఉంటే అతనికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఊరుకోండి, ఏమంత అందంగా ఉన్నాడు అంటూ కొట్టి పారేసింది .కానీ తన హృదయంలో అతని చిత్రాన్ని ముద్రించుకొని ప్రేమించే సాగింది.

ఇద్దరి ఇళ్లలోనూ పిల్లలను పద్ధతిగా పెంచడం వల్ల ,ఎవరు ఒకరికి ఒకరు ఫోన్లు గాని మెసేజ్ గాని చేసుకోలేదు .ఈ కాలం పిల్లల్లా, ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు. ఒకవేళ ఎవరైనా చూస్తే బాగుండదు అని మోహన్, తాను చేస్తే తనకి తొందర అనుకుంటాడేమో అని రోహిణి ఇద్దరు మొహమాటపడుతూ మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేసుకోలేదు అలా నెల రోజులు గడిచిపోయాయి. ఆషాడం వెళ్ళిపోయింది.

ఇక రోహిణి అత్తగారింటికి పంపాలని అనుకుంటున్నారు దానికోసం సారే అంతా సిద్ధం చేశారు పుట్టింటి వాళ్లు.

ఇంతలో….

అత్తింటి వాళ్ల దగ్గర నుంచి పిలుపు అమ్మాయిని ఇప్పుడే పంపొద్దు మాకు దూరపు బంధువు ఒక ఆయన చనిపోయారు కాబట్టి 12 రోజుల వరకు పంపకండి, అంటూ సందేశం రావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

రోహిణి మోహన్ల ఆశలన్నీ అడియాసలైయ్యాయి. ఎప్పుడెప్పుడు చూద్దామా, అని అనుకుంటున్నా ,వారి హృదయాలు రెండు మూగబోయాయి. వారిలో తాపం పెరిగిపోతుంది. పెళ్లయి కూడా ఇలా దూరంగా ఉండాల్సి రావడంతో, రోహిణి కన్నా మోహన్ కి ఆరాటం ఎక్కువ అయింది.

ఇక ఎలాగో ఆ 12 రోజులు అతి భారంగా గడిచిపోయాయి ఈ 12 రోజులలో రోహిణి మోహన్ ని తలుచుకొని క్షణం లేదు అలాగే మోహన్ కూడా రోహిణి తలవని క్షణం లేదు.. ఇలా ఆఫీసుకు వస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడు మోహన్. అతని బాస్ చేత తిట్లు తింటున్నాడు. అన్ని తప్పులు చేస్తూ, మరోవైపు రోహిణి పరధ్యానంగా ఉంటూ సరిగ్గా తినకుండా బక్క చిక్కిపోయినట్టుగా అయింది.

ఇక మంచి రోజులు వచ్చాయి. అమ్మాయిని అత్తగారింటికి పంపండి. అంటూ అత్యంత మంచి సందేశం రావడంతో మూట కట్టిన  సారే అంతా కారులో పెట్టి అమ్మాయితో పాటు మేనత్తని ఇచ్చి పంపించారు.

ఈలోపు మోహన్ వాళ్ళ తల్లిదండ్రులు అదే రోజు శోభనానికి ముహూర్తం కూడా పెట్టించారు. మోహన్ సంతోషానికి అవధులు లేవు ఇన్నాళ్ళకి తన హృదయ తాపం తీరబోతోంది .అని అనుకుంటూ ఆనందంగా ఉన్నాడు.

రోహిణి మంచి ముహూర్తంలో అత్తారింట్లో కాలు పెట్టింది. ఆ రాత్రి మంచి గా మత్తెక్కించే మల్లెలతో గుబాలించే గులాబీలతో, అత్తరు పన్నీరులతో ,అలంకరించిన కొత్త మంచం కళకళలాడుతుంది. కొత్తజంట రాక కోసం ఎదురుచూస్తుంది.

ముందుగా ఆ గదిలోకి మోహనే వచ్చాడు. ఆ తర్వాత అమ్మలక్కల నవ్వులతో పచ్చి జోకులతో మెల్లిగా రోహిణి నీ పాల గ్లాస్ ఇచ్చి, లోపలికి తోసి బయటకు గడియ పెట్టారు. అమ్మ లక్కలు నవ్వుకుంటూ..

పెళ్లయిన నెలన్నర తర్వాత రోహిణి మోహన్లు మొదటిసారిగా ఒంటరిగా ఉన్నారు. ఆ గదిలో నిశ్శబ్దంగా ఉంది. మోహన్ మొహమాటం వల్ల రోహిణి దగ్గరికి వెళ్లలేక పోతున్నాడు. రోహిణికి అంతే ఇద్దరు బిడియాబడుతూ ఆమె తలుపు దగ్గరే నిలుచుంది. అతను మంచం దగ్గరే నిలబడ్డాడు.

అలా చాలాసేపు నిల్చోనించని కాళ్లు లాగుతున్న కూడా రోహిణి అక్కడి నుంచి కదలలేదు. ఇంతలో హఠాత్తుగా ఒక ఎలుక ఆమె కాళ్ళ మధ్యలో నుంచి పోయింది. అమ్మో ఎలక అంటూ భయంతో గబగబా వచ్చి మోహన్ ని హత్తుకుంది. పాల గ్లాస్ కింద పడిపోయింది. రోహిణి మోహన్లు ఇద్దరూ కొత్త మంచం మీద ,మత్తెక్కించే మల్లెలతో గుబాలించే గులాబీలపై పడ్డారు.

ఇంకేముంది వారి ఇన్నాళ్ల హృదయ తాపం అలా ఎలుక రావడంతో, మొహమాటం అంతా మరచిపోయి, మత్తులో మునిగిపోయారు. ఇక వాళ్లకి లోకంతో సంబంధం లేదు. మనతో కూడా సంబంధం లేదు. వాళ్ళని అలా మనం వదిలేయాలి కదా, సరే ఇక తలుపులు, కళ్ళు రెండు మూసేసుకోండి.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *