హృదయ తాపం
వయసుతో సంబంధం లేదు
ప్రేమకు మనసుతో సంబంధం లేదు
ప్రేమ మదిలో పుడుతుంది
మనసే దోచుకుంటుంది
ప్రేమ గొప్పది
ప్రేమ చేరిగిపోనిది
ఎడారిలో మని లాంటి
గీతను ప్రేమించిన సుమన్
పాదాల కడనే ఉన్న దాసీలాంటి
సతిగా జీవించిన గీత లాంటి
మంచికి చేరువా
మంచితనానికి పెన్నిధి
ప్రేమ హృదయంలో తాపం పుట్టిస్తుంది
ప్రేమ యుగయుగాలు నిలిచేది
అందుకే సుమన్ గీతల ప్రేమ చిరస్మరణీయం
ఆ జన్మ చంద్రార్థం
ఎక్కడ జరగనివి జరిగితేనే మార్పు
ఎప్పుడు చెప్పనిది
చెప్పితేనే మార్పు
మార్పు కోరుకున్నారు
అనాధకు జీవితం పెట్టారు
ఆశల వీధి లోకంలో
అనంత ప్రేమ పుష్పంలో
చల్లని ఆకాశ మదనంలో
హృదయంలో తాపం మొదలైంది
దాని పేరే చిన్నవాడి ప్రేమ..
దాని పేరు చిన్నదాని ప్రేమ.. !
-యడ్ల శ్రీనివాసరావు