హృదయ కమలం
జాలేలేని ప్రపంచంలో
జారిపోతున్న భానుడు
పారిపోయే ఆశలాంటివాడు కాదు
వేదనలన్నీ వదిలేయమంటూ
మరోదిక్కుకు సాగుతాడు
సంజవేళ కమ్మేచీకటి తాత్కాలికమయినట్టు
ఉదయం వెలుగుకు వేచి చూద్దాం
ఊపిరి తోడుగా అడుగేయవోయ్
చింపిరి ఆలోచనలను చిదిమేయ్
వికసించే కమలానికి బురదంటుతుందా
హృదయ కమలాన్ని పరిశీలించు
అంటుకున్న మలినాలను తొలగిస్తావు
-సి.యస్.రాంబాబు