హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 1

హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 1

అనుకున్నట్టుగానే సాయి, కిషోర్ ఇద్దరూ కలిసి ఎప్పట్నుంచో స్టూడెంట్స్ ని భయపెడుతున్న ఆ హాస్టల్ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి చేరుకున్నారు.

రాత్రి పదకొండు అయింది, చుట్టుపక్కల అందరూ పడుకున్నారు. ఇదే సరైన సమయం లోపలికి వెళ్లడానికి అని సాయి అన్నాడు. వెంటనే కిషోర్ తన బ్యాగ్ లోంచి కెమెరాని తీస్తూ ఇక్కడ ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుని దాన్ని ఈ కెమెరాతో కాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చెయ్యాలి అని చెప్పాడు. 

సాయి దానికి ఆలోచిస్తూ, ముందు అది వైరల్ అవ్వాలి అంటే మనం ప్రాణాలతో బయటకి వెళ్ళాలి, ఇక్కడ చడీచప్పుడు లేని ప్రదేశంలో నా గుండె చప్పుడు నాకే గట్టిగా వినిపిస్తుంది. భయపడుతూ కూర్చుంటే ప్రోద్దున్న అయ్యేవరకు మనం లోపలికి వెళ్లలేము. త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేద్దాం అని కిశోర్ తొందరపెట్టాడు.

కిషోర్ కెమెరా ఆన్ చేసాడు, సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేసాడు. ఆ గేట్ అలజడి వినడానికి చాలా భయాంకరంగా అనిపించింది. ఐనా సరే చాలా రోజులుగా తెరువని గేట్ కనుక అలా అలజడి చెయ్యడం సహజమే అంటూ కిషోర్ అనేసరికి……

సాయి ౼ ఈరోజు ఎందుకో ఇంటికి తిరిగి వెళ్తాము అని నమ్మకం లేదు. వీడు ప్రతి దానికీ ఏదో ఒక కారణం చెప్తూనే వుంటాడు అని కిషోర్ ని ఉద్దేశించి….. “దేవుడా! నన్ను నువ్వే కాపాడాలి అని తనలో తానే అనుకున్నాడు.”

సరే ఎలానో దైర్యం చేసి ఒక అడుగు వేశాం, విషయం ఏంటో తెలుసుకునే వెళదాం అని ఇద్దరు లొపలికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ కదిలారు. ఎదురుగా ఒక పిల్లర్, దాని వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెంటనే కిషోర్ అటు వైపు లైట్ వెయ్యి అక్కడ ఎవరో వున్నారు అని సాయిని హెచ్చరించాడు. సాయి ఉలిక్కిపడి లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేం అర్ధం కావట్లేదే అంటూ కిషోర్ మనసులో గొణుక్కునాడు.

అక్కడ నుంచి కుడి వైపుగా మెట్లను అనుసరిస్తూ ఇద్దరు ముందుకు సాగారు. మెల్లగా నడుస్తూ, అస్సలు అలికిడి చెయ్యకుండా, పెదవి విప్పకుండా, లోపల భయం తో చెమటలు పట్టేశాయ్, బయట భయంతో కాళ్ళు వణికిపోతున్నాయ్. ఐనా సరే ఎటూ చూడకుండా మొదటి అంతస్తు కి చేరుకున్నారు.

ఇంతలో అక్కడ విడిచిపెట్టిన టాప్ ఒకటి కనిపించింది. అది చూసిన కిశోర్, వెళ్లి ఆ టాప్ ని కట్టి రమ్మని సాయికి చెప్పాడు. దానికి సాయి, ఎవరు లేని ఈ హాస్టల్ లో ఈ టాప్ ని ఎవరు విడిచిపెట్టి వెళ్లారు. నాకు చాలా భయం వేస్తోంది, నేను ఆ టాప్ ని ముట్టుకుని, దెయ్యం వచ్చి “నేను నీళ్లు తాగుతుంటె, నా టాప్ నే ఆపుతావా రా” అని నన్ను చంపేస్తే, వామ్మో! నేను వెళ్లను అని భయపడతాడు.

దానికి కిషోర్ సరే ఈ కెమెరా పట్టుకో నేనె ఆపుతా అని టాప్ దగ్గరకి వెళ్తాడు. టాప్ ని ఆపుదాం అని కిషోర్ చెయ్ టాప్ పైన చెయ్యి వేస్తూవుంటాడు, ఇంతలో సాయి కెవ్ అని ఒక్కసారిగా అరుస్తాడు. ఉలిక్కిపడిన కిషోర్ మళ్ళీ ఏమైందిరా అంటూ సాయి ని అడుగుతాడు. దానికి సాయి వెక్కిలి నవ్వు నవ్వుతూ, హేహే ఏం లేదు ఊరికే అంటూ ఒక పక్క భయంతో, మరో పక్క అమాయకత్వంతో ఒక రకంగా నవ్వుతాడు. నీ భయంతో నన్ను భయపెట్టకు అని టాప్ కట్టేస్తాడు కిషోర్.

అలా నాలుగు అడుగులు వేసి వెళ్ళేసరికి టాప్ వాటర్ శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. ఇద్దరి కాళ్ళు గజ గజ వణికిపోతాయి. నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరూ భయపడుతూ సరే చేతులు పట్టుకుని వెళదాం పద అని అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా టాప్ దగ్గరకి చేరుకుని అటు ఇటు ఎవరైనా ఉన్నారా అని చూసుకుని టాప్ కట్టేసి పై అంతస్తు మీదకి ఎవరో తరుముతున్నట్టు ఉరికారు.

గబ గబ పరిగేత్తేసరికి ఆయాసం వచ్చి ఇద్దరు కిందకి తల వాల్చి గట్టిగ శ్వాశ తీసుకుకోవడం మొదలుపెట్టారు. కానీ నిశబ్ధం చాలా భయంకరంగా ఉంటుంది!! అని తనికెళ్ళ భరణి “అతడు” చిత్రంలో చెప్పినట్టు, ఆ నిశబ్దం లో వీళ్ల ఊపిరి శబ్దం అంత భయంకరంగా అనిపించింది.

సరే సాయి ఇక మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసి బయల్దేరధం. ఇదే మూడవ అంతస్తు, రూమ్ నెంబర్ 313 ఎక్కడ ఉందో కనిపెట్టి అసలు ఇక్కడ ఏముందో తెలుసుకుని బయల్దేరి పోవాలి అని కిషోర్ చెప్పాడు. పద మరి ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం, త్వరగా ఆ గదిని వెతికి మనకి కావాల్సిన ఫ్యూటేజి తీసుకుని పరిపోదాం అని సాయి చెప్పగా కిషోర్ కెమెరా లైట్ ఆన్ చేసి ముందుకు సాగాడు.

ఇరు వైపుల గోడలు, వాటి మధ్యలో గదులు, నాకు తెలిసి మనకి కావల్సిన గది మధ్యలో ఉండొచ్చు పద అంటూ కిషోర్ సాయి ని ముందుకు పంపాడు. ఇంతలో గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. విచిత్రమైన అలజడులు వినిపిస్తున్నాయి, వాళ్ళతో పాటు వేరే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతలో కెమెరా లైట్ హటాత్తుగా ఆగిపోయింది.

సాయికి భయం వేసి కేకలు వెయ్యడం మొదలుపెట్టాడు. ఆగు భయపడకు లైట్ ఆన్ చేస్తున్నా, కంగారు పడకు అంటున్నా సాయి వినడం లేదు. ఒకటే అరుపులు గోడలు బద్దలయ్యేలా, చెవులు పగిలిపోయేలా. ఇక లాభం లేదని కిషోర్ వెంటనే సెల్ ఫోన్ లో టార్చ్ ఆన్ చెయ్యమన్నాడు. ఈ టైం లో ఇది కూడా ఆన్ అవ్వట్లేదే, ఇక ఇదే ఆఖరి రోజు నా జీవితంలో అంటూ-

దేవుడా! మమ్మల్ని కాపడవయ్య అని అన్న వెంటనే కెమెరా లైట్ ఆన్ అయింది. దేవుడా నువ్వు ఉన్నావ్, నాకు తెలుసు నువ్వు ఉన్నావ్. థాంక్స్ అని సాయి దేవుడికి చెప్పి కిశోర్ వైపు తిరిగాడు. 

కిశోర్ కళ్ళని పెద్దవి చేసి, మెల్లగా కెమెరా లైట్ డోర్ వైపు తిప్పాడు. ఇప్పటి వరకు వెతుకుతున్న రూమ్ నం. 313 ఎదురుగా. ఇద్దరి గుండెచప్పుడు 120 కి.మీ. ల వేగంతో బులెట్ ట్రైన్ లా పరిగెత్తడం మొదలెట్టింది. ఇద్దరికి ఒకేసారి ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ అయింది. ఇద్దరు ఒకరు మొఖాలు ఒకరు చూసుకుంటూ నీకు అదే బాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా, నాకు అదే వినిపిస్తోంది అనుకున్నారు.

సరే ఇక ఆలస్యం చెయ్యడం ఎందుకు, వచ్చింది ఈ రూమ్ గురించే కదా, తెరిచి ఇందులో ఏముందో అందరికి చూపించే సమయం వచ్చింది అని కిషోర్ చాలా విశ్వాసంతో సాయికి చెప్పాడు. ఈ గదికి తాళం వేసి ఉంది. దీన్ని తెరిచేదెలా అని సాయి అడగగా, బద్దలుగొట్టేధం అని కిషోర్ చెప్తాడు. వేరే మార్గం లేదు బయటకెళ్లే ఆలోచన లేదు, బద్దలుకొట్టడం ఒకటే మార్గం. ఇప్పటివరకు అన్ని అడ్డంకులు దాటుకుని, భయాన్ని జయించి ఎంత నమ్మకంతో ఇంత దూరం వచ్చామో మర్చిపోకు సాయి. వెళ్తే విషయం ఏంటో తెలుసుకుని వెళ్ళాలి.

నేను బద్దలుకొడతా నువ్వు కెమెరా పట్టుకో అని కిశోర్ సాయిలో ధైర్యం నింపి తాళాన్ని బడ్డలకొట్టడం మొదలుపెట్టాడు. కెమెరా పట్టుకున్న సాయి చేతులు వణుకుతున్నాయి. ఐనా సరే చెమటలు తుడుచుకుంటూనే కెమెరాని గట్టిగా పట్టుకున్నాడు. కిషోర్ తాళాన్ని చాలా బలంగా కొడుతున్నాడు, గాలి గట్టిగా వీయడం మొదలు పెట్టింది. మిగతా గదుల తలుపులు అన్ని వాటంతట అవే తెరిచేసుకున్నాయ్. గాలికి గట్టిగా కొట్టుకుంటున్నాయ్.

అటు ఇటు అన్ని గదుల తలుపులు కొట్టుకునే అలజడి, మధ్యలో కెమెరాతో సాయి, తలుపును బడ్డలకొడుతూ కిషోర్ చూడడానికి ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. ఇంతలో తాళం విరిగింది. గాలి వీయడం ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపులు వాటంతట అవే మూసుకున్నాయ్. సాయి కంట్లో కన్నీరు జలపాతం లా ప్రవహిస్తుంది.

తలుపు మెల్లగా తెరుచుకుంది. ఇద్దరి గుండె చప్పుడు బయటకి వినిపిస్తోంది. కానీ కిషోర్ సాయిని కెమెరా గట్టిగా పట్టుకో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకు. నేను లోపలకి వెళ్తున్నా, నువ్వు నా వెనకే రా అంటూ హెచ్చరించాడు. ఆ గది మొత్తం చాలా రోజుల నుంచి తెరవంది అయి మొత్తం బూజుతో నిండి పోయింది. కిషోర్ తన రెండు చేతులతో ఆ బూజుని తుడుస్తూ ముందుకు ఒక్కో అడుగు వేస్తున్నాడు. కొంత బూజు తుడిచాక అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు. ఆ కుర్రాడికి ఇరవయ్యి ఏళ్ళు ఉంటాయి ఏమో. అసలు ఎవరు ఈ కుర్రాడు ఇక్కడ ఎం చేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నలు మదిలో వస్తున్నాయి ఇద్దరికి.

ఇంతలో ఆ కుర్రాడు కళ్ళు పైకి లేపి దయచేసి మా ఇంట్లో చెప్పకండి నేను కాలేజ్ కి రాలేకపోయా ఈరోజు. కానీ అంతా చదువుతున్నా, ఎగ్జాం బాగా రాస్తా దయచేసి మా ఇంట్లో చెప్పకండి. మా నాన్న చంపేస్తాడు అని భయపడుతూ వీళ్ళని బ్రతిమాలుతున్నాడు. ఇద్దరికి ఏం అర్ధం కావట్లేదు.

ఇంతలో ఆ కుర్రాడు మీరు చెప్పేస్తారు, మీరు మంచోళ్ళు కాదు. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను. నాతో ఉంచేస్తా అని అనగానే సాయి భయం తో కెమెరా పడేస్తాడు వెంటనే తలుపులు వాటంతట అవే ముసుకుంటాయ్. లోపల అరుపులతో కాసేపు ఆ గది ముసుకుంటుంది. ఆ గదిలోంచి రక్తం అలా పరిచిన చాప ల బయటకి వచ్చింది. లోపల అరుపులు ఆగిపోయాయి. నిశబ్దం అలుముకుంది. ఆ కుర్రాడు రూమ్ బయట

“Don’t Disturb” అని ఒక బోర్డ్ పడుతుంది.

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *