హీరోయిన్

హీరోయిన్

హీరోయిన్ అభిమాన హిరోయిన్
అంటే
అందమైన కళ్ళు
అందమైన చిరునవ్వు
తెరమీద నడిచే
కలల రాణీవని
అతిలోక సుందరివని
అభిమానులు ఆశ్రితజనులు
నీచుట్టూ వున్న బలగం అనుకున్నాను
కాని

ఇప్పుడే తెలిసింది
నిరంతర మీడియ సొమ్మువని
శరీరాన్ని నడివీధి అంగడి చేస్తారని
దు:ఖాన్ని కూడా అమ్ముకుంటారని
స్ఫర్స తెలియని చర్మంతో వ్యాపారం చేస్తారని

అందన్ని పొగిడిన నోళ్ళే
వయసుని గుర్తుచేసీ
డిబేట్లుపెట్టీ నీసౌందర్యానికి
చనిపోయిన దేహనికి గాట్లు పెడతారని

అందం పురుగుని శరీరంలోకి పంపిందెవరు?

అరవై ఏళ్ళు వచ్చినా
ఇరవై ఏళ్ల అమ్మయే కావలనుకునే
మీరే కదూ అందానికి అగ్గి పెట్టీంది!

ముపై ఏళ్ళకే వదిన పాత్రలకి
నలభై ఏళ్ళకే అమ్మ పాత్రలకి
యాభైఏళ్ళకే అమమ్మ పాత్రలకి

తోసేసిన హీరోల్లారా..
వోక్కసారి ఆలోచించండి

మీకోసమే ఈపరుగు పందెంలో
చీడపట్టీన వృక్షాలు అవుతున్నాయి
బోటేక్సలు,ఫేస్ లిఫిటింగ్ లు

ఆడదీ అంటే ఎప్పటీకీ
బిగు వు సడలని వయసని
కళ్ళల్లో కోర్కేని శరీరంలో
రక్తాన్ని మరిగించే బోమ్మ అని
అనుకోబట్టే కదా!

ఆసక్తిని ఆశయాన్ని
బట్టల్లేని శరీరంతోనే
వేడుక చూసేదాక తీసుకువెళుతున్నారు

దేహలకి వయసుని అంటగట్టి
శ్మశానం చేయడం చేయకండి
ఆ అందాల బోమ్మని ప్రశాంతంగా
నిద్రపోనిండి..

 

 

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *