హాస్యకధ

హాస్యకధ

   రవి చిన్న చిన్న కధలురాస్తూ ఉంటాడు. కానిఇప్పటి వరకు ఏ పేపర్లోను,పత్రికలలొదేనిలోనూప్రచురించ బడలేదు. చాలా సార్లు అంతకుముందు
పంపించినవి తిరిగి వచ్చాయి. కాని ,తన పేరుఏదన్నా పత్రికలోనో, పేపర్లోనోఅచ్చులోచూసుకోవాలన్న కోర్కె నెరవేరడంలేదురవికి.మళ్ళీ ఒక చిన్న కథ రాసాడు. ఏదయినా  ఒక  కొత్త
పేపర్కో, పత్రిక్కో  పంపించాలని   చూస్తున్నాడు.అనుకుంటుండంగానే వెళ్లే దారిలో ఒక పేపర్ షాపు
కనిపించింది. అక్కడ కవి అనే మాసపత్రికలు ఒకతాడుకి క్లిప్పులు  పెట్టి వేళ్లాడుతూ కనిపించాయి .ఇదేదో కొత్తది లాగా వుందే అని  వెంటనే ఒకటి కొనిపత్రిక అంతా తిరగేసాడు. దాంట్లో చిన్న చిన్న కధలు,
కవితలు జోకులు ఇంకేవోచాలావున్నాయి.హమ్మయ్యఅనుకొన్నాడు.
  వెంటనే  ఆపత్రిక అడ్రసు కనుక్కొని ఎడిటర్నికలిసి తను రాసిన కథ  చూపించాడు. కథబానే వుంది గాని చూస్తాం!అని, సరే ఈరచన మీ
సొంతమని,ఇది దేనికి కాపీ కాదని, రాసిఇవ్వమన్నాడు ఎడిటర్ఎ,వరో రాసిన ఒక
హామీపత్రం ఇస్తూ.నేనే రాసానండి. కాపీకొట్టలేదు.అని కనిపించని కోపంతో అన్నాడు రవి. అది సరే!.
అదే రాసివ్వండన్నాడు,ఎడిటర్ ఇదిగోనండి!అని ఈవిధంగా రాసి ఇచ్చాడు ఎడిటర్కి .
         అయ్యా ఎడిటర్ గారు , మీరు కోరినట్లు హామీపత్రం సమర్పించన్నాను.
                    హామీపత్రం
  ఈ రచన నా సొంతమే.దానికేం అనుమానం
లేదు.నా చేత్తోనే నా కాగితమ్మీదే నా  పెన్నుతోనే
రాశాను.ఇది దేనినుండొ కాపీ  కొట్టేంత చిన్న
పిల్లోణ్ణి  కాదు . ఇది దేనికి అనుకరణో   అనుసరణో
అనువాదమోచేసేంత  అవసరం నాకు అసలు
లేదు.ఏ బ్లాగులోనో వెబ్సైట్లోనో పెట్టేటంత నాలెడ్జి
నాకు లేదు.అవేంటోకూడా నాకు తెలియదు.నాకు
కంప్యూటర్రాదు. ఎక్కడన్నా  పరిశీలనలో ఉన్నాయో
లేదో తెలియదు. అంతకు మును పంపించిన వన్నీ
తిరిగి వచ్చినాయి ఇంక కొన్ని తిరిగి రావాల్సినవి
వున్నాయి. నేనొక సహజసిద్ధమైన నికార్సయిన
రచయతను.వంశ పారంపర్యంగావచ్చింది. మా తాత
ముత్తాతలు గొప్ప కవులు.
                                   ఇట్లు,
                                        వినయవిధేయ లతో,
                                                  రవి.ఫోన్ నెం …………..
 ఎడిటర్ పగలపడి నవ్వుతూ, అరే! భలేవారండి!,
హామీపత్రం లో ఇవన్నీ  రాస్తారా!మా నార్మ్స్ ప్రకారం
ఇవ్వాలి. అన్నాను అంతే.మీ కథలు దేంట్లోను
పడలేదేంటి! ఫ్రస్టేషన్లోఉన్నట్టున్నారు.అంతకుముందు
ఎప్పుడూ హామీపత్రం  ఇవ్వలేదా! అన్నాడు ఎడిటర్.
ఏమో సార్!
మర్చిపోయానన్నాడు రవి. సరే ఈ సారికి సరేగాని
దీన్నే  ఒక జోకులాగా వేసుకొంటాం ఆ కథ సంగతి
తరవాత చూద్దాం!అన్నాడు ఎడిటర్.
నిజంగానా!అన్నాడు రవి ముసి ముసి నవ్వులు
నవ్వుతూ. అవును అన్నాడు ఎడిటర్ ఒక చిన్న
స్మైలిస్తూ.  రవి ఆనందంగా తనలో తానే
నవుకుంటూ వెళ్ళిపోయాడు.
     ఏదోవిధంగా , పెద్ద  పెద్ద  అక్షరాలతో,  తన
పేరు,ఫోన్. నెం.కవి అనేమాస  పత్రికలో రావటం
చూసు కొని తెగ సంబర పడి పోయాడు మనచిట్టి
కవి రవి.
                                            -(రమణ బొమ్మకంటి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *