హద్దులేమీ లేనివాళ్ళు
యువత గీత దాటితే
మన దేశానికి నష్టమే.
పబ్బులకెళ్ళిన యువత
నిర్వీర్యం అయిపోతోంది.
సమయపాలన అసలే లేదు.
పెద్దలను గౌరవించేదే లేదు.
భవిత పట్ల అనురక్తి లేదు.
జీవితం పట్ల ఆసక్తి లేదు.
పనిచేసే ఉత్సాహం లేదు.
హద్దులు దాటిన యువతకు
సుద్దులు చెపితే వింటారా.
చెడు అలవాట్లకు బానిసైన
యువత పెద్దల మాట వినాలి.
చేయి చేయి కలపి ముందుకు సాగాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని