హాస్యానందం!

హాస్యానందం!

జంధ్యాల గారు కొన్నాళ్ళు ఆంధ్ర ప్రభ లో “జంధ్యా మారుతం ” అన్న శీర్షిక నిర్వహించేవారు అందులో పాఠకుల ప్రశ్నలకి విట్టీ గా సమాధానం ఇచ్చేవారు..

అందులో ఒక పాఠకురాలి ప్రశ్న :
– జంధ్యాల గారూ! మామూలుగా మగవాళ్ళు “నా భార్య” అనీ, ఆడవాళ్ళు ” మా ఆయన ” అని అంటూంటారు కదా!! మరి మగవాళ్ళు ” మా భార్య ” అని ఆడవాళ్ళు ” నా ఆయన” అని ఎందుకనరు ???

దానికి జంధ్యాల గారి సమాధానం:

– ఎందుకనరూ!! పరభాష వాళ్ళు తెలుగు మాట్లడేప్పుడు అంటూ ఉంటారు.. 1985 వ ప్రాంతంలో నేను, గాయకులు బాలసుబ్రమణ్యం గారు, ప్రముఖ హైప్నోటిస్ట్ బి.వి పట్టాభిరాం గారు మరి కొందరం అమెరికా వెళ్ళాం.. మేము దిగిన ఇంటాయన అరవాయన..

ఆయన, ఆయన భార్య ఉద్యోగానికి వెళుతూ – నేను, మన పెండ్లాం పనికి పూడుస్తా ఉండాం.. ఫుడ్ అంతా టేబుల్ మీద ఉండాది- మీరు సిగ్గు లేకుండా తినండి. ఇంకా ఏమైనా కావాలంటే మా అబ్బాయిని అడుక్కు తినండి…
ఇంకా ఏవైనా కావాలంటే రాత్రికి మన పెళ్ళాం మీ కోరిక తీరుస్తాది అన్నాడు..

హతవిధీ.. 😂😂

జంధ్యాల గారి ఈ సమాధానం చదివి దొర్లి దొర్లి నవ్వాను అరగంట ఆపకుండా.. అరవాయన మాట్లాడిన మాటలకి వాళ్ళ పరిస్థితి అప్పుడు ఎలా ఉందా అని తల్చుకుని తల్చుకుని మరీ 😂😂

– సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *