హామీలన్నీ నీటి మూటలేనా?
క్రితం నెల రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు చాలా మంది చనిపోయారు. అప్పుడు ఆ ప్రమాదంలో కుట్ర కోణం ఉందని కొందరు, మానవ తప్పిదమని కొందరు, సిగ్నలింగ్ వ్యవస్థ తప్పిదమని కొందరు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానించారు. ఆ ప్రమాదం వల్ల ప్రాణాలు పోయిన వారి ప్రాణాలు తిరిగి రావు కదా. ప్రమాదం జరగడం అనేది చాలా బాధ కలిగించే విషయం.
అప్పుడు అధికారులు చాలా హామీలు ఇచ్చారు. భధ్రత గురించి మరింత శ్రద్ధ చూపెడతామని అన్నారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ రైలు ప్రమాదం జరిగింది. రైలు భోగీలు తగలబడ్డాయి. షార్ట్ సర్కూట్ జరిగింది అని కొందరు. ఎవరో సిగిరెట్టు కాలవడం వల్ల ప్రమాదం జరిగింది అని మరికొందరు చెపుతున్నారు. అదృష్టం కొద్దీ పగలు జరగడం వల్ల ఎవరో చైను లాగి రైలు ఆపారు. అదే రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు జరుగుంటే అని ఒకసారి ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పాటుకు గురి అవుతుంది.
ప్రాణ నష్టం జరగలేదు కానీ చాలా మందికి చెందిన లగేజీ కాలిపోయింది. బట్టలు, పేపర్లు కాలిపోయాయి. రైలు ప్రయాణం అనేది తప్పనిసరి అయిపోతున్న నేపధ్యంలో ఇలా ప్రమాదాలు జరిగితే ప్రయాణికుల పరిస్థితి ఏమిటి? అందులో మీ తమ్ముడు ఉండొచ్చు. మీ స్నేహితులు ఉండొచ్చు. మీ చుట్టాలు ఉండొచ్చు. ఎవరి ప్రాణాలైనా విలువైనవే. ఏదిఏమైనా
అధికారులు తాము ఇచ్చిన భధ్రతా హామీలను తప్పక నేరవేర్చి ప్రమాదాలు జరగకుండా నివారించాలి. ఇది ఒక సామాన్య మానవుడి విన్నపము.
– వెంకట భానుప్రసాద్ చలసాని